Rice Price: భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు.. తక్కువ ధరకే అందిస్తున్న ఏపీ..!
బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో బియ్యం రూ.100 చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో వల్ల దేశంలో పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తుండటం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నీటి కొరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయ అవసరాలకే కాకుండా తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
అయితే బియ్యం ధర ఒకటే కాదు.. కూరగాయలు, ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.80 పలుకుతున్నాయి. వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సన్న రకాల నుంచి సాధారణ రకాల వరకు రిటైల్ విక్రయాల్లో దాదాపు 15% నుంచి 25% వరకు ధరల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు వంటి ప్రధాన పట్టణాల్లో వినియోగదారులు బియ్యం కొనుగోలు చేయాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న సోనా మసూరి, బీపీటీ 5204, హెచ్ఎంటీ వంటి సన్న బియ్యం రకాల రిటైల్ ధరలు కిలోకు రూ.65 నుంచి రూ.83 వరకు పలుకుతుండగా, క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.8,300 వరకు వ్యాపారం జరుగుతోంది.

యాసంగి సీజన్ వరి పంట భారీగా తగ్గే అవకాశం ఉంది. అప్పుడు బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రైతు బజార్ల ద్వారా సన్న బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. రెండు రకాల బియ్యాన్ని సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. బీపీటీ బియ్యంను కిలో రూ.49కి అందించనుండగా.. కేఎన్‌ఎం బియ్యంను కిల రూ.50కి అందిస్తామని అధికారులు తెలిపారు. ఒక్కొ కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్ బస్తాను మాత్రమే ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో రేషన్ బియ్యమే సన్న బియ్యం ఇస్తున్నారు. రేషన్ బియ్యం వండుకున్నవారు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొంత మంది మాత్రం రేషన్ బియ్యం తినకుండా బయట అమ్ముకుంటున్నారు.
రానున్న రోజుల్లో బియ్యం ధరలు భారీగా పెరిగితే.. ఈ రేషన్ బియ్యం తినడమే బెటర్ అనే పరిస్థితి వస్తుందన్నారు. వచ్చే రోజుల్లో మిగతా వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వంట నూనె, కూరగాయలు, నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications