Gold: బంగారం ఇప్పుడే కొనేయండి.. లేకుంటే ధరలు పెరిగే అవకాశం ఉందట..!

భారీగా పెరిగిన బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ లో కూడా పసిడి ధరలు ఒత్తడిని ఎదుర్కొంటున్నాయి. అయితే పుత్తడి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ బంగారం ధరలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన కొనుగోళ్లతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు 10 గ్రాములకు రూ.లక్ష వరకు దిగొస్తే ధరలు తగ్గినట్లు కానీ.. రూ.10 వేలు, రూ.20 తగ్గడం భారీ పతనం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,200 వద్ద కొనసాగుతోంది.

అయితే గత రెండు, మూడు నెలల నుంచి రూ.5 నుంచి రూ.10 పెరగడమో లేదా తగ్గడమో కనిపిస్తుందే తప్ప భారీ తగ్గదల ఎక్కడ లేదు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడానికి ఛాన్స్ ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్‌ కదలికలపై ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. అక్టోబర్‌ 16, 2026 నాటి మార్కెట్‌ సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగగా దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ కొనుగోళ్ల మద్దతు కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ ఇంకా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం కొనుగోలు తగ్గుతుందని భావిస్తున్నారు.

Gold Price

అయితే చాలా మంది పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా చైనాతో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌ 16 ఉదయం ఎంసీఎక్స్‌లో డిసెంబరు డెలివరీ బంగారం ఫ్యూచర్స్‌ 10 గ్రాములకు రూ.1,48,152 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే ఇవి వరుసగా 0.45 శాతం, 1.07 శాతం పెరిగింది. అమెరికా ఫెడ్‌ తదుపరి నిర్ణయాలు, డాలర్‌ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు బులియన్‌ ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

బంగారం ధర స్వల్ప కాలంలో తగ్గినా.. దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2027 నాటికి బంగారం రూ.లక్ష 80 వేలకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరిస్థితులు మారి డిమాండ్ తగ్గితే తప్ప పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+