IT News: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..
IT Sector: ప్రస్తుతం ఐటీ రంగంలోని ఉద్యోగులను, ఆ రంగంలోకి వెళ్లాలని భావిస్తున్న వారికి అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. 2023 ముగుస్తోంది వచ్చే ఏడాదైనా పరిస్థితులు చక్కబడతాయా అనే ప్రశ్నలకు కాదు అనే సమాదానం వినిపిస్తోంది.
భారతీయ ఐటీ రంగం మందగమనంలో ఉన్నందున 2024లో జాగ్రత్తాగా ఉండాల్సిన అవసరం ఉందని టెక్ పరిశ్రమ అనుభవజ్ఞులు చెబుతున్నారు. పరిస్థితులు 2025 నాటికి మెరుగుపడతాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఏడాదిలో టెక్ రంగం ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావానికి గురైంది. ఈ క్రమంలో ప్రధాన మార్కెట్లైన అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి డీల్స్ దాదాపు సన్నగిల్లాయి. పెద్ద డీల్స్ కుదుర్చుకోవటం అసాధ్యంగా మారటంతో కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

ఇతర దేశాల్లోని ఐటీ క్లైంట్స్ సైతం ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ఐటీ సేవల కంపెనీలు ఇప్పటికే తమ ఏఐ ఆధారిత సేవలను పరిచయం చేసేందుకు వాటికి విక్రయించుకునేందుకు కష్టపడుతున్నాయి. అయితే వీటిని అందిపుచ్చుకునేందుకు లేదా వినియోగించేందుకు కస్టమర్‌లందరూ ఇంకా సిద్ధంగా లేరని ఫండింగ్ వేదిక ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితి బడ్జెట్‌లను కుదిపేస్తోందని సౌరభ్ శ్రీవాస్తవ అన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అనేక ఐటీ సేవల కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఐటీ రంగంలో భారీగా ఉద్యోగుల తొలగింపులు కనిపించాయి. దీంతో దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయ్యారు. ఇందుకు ఆర్థిక మందగమరం ఒక కారణం కాగా.. చాలా కంపెనీలు ఏఐ టూల్స్ వినియోగాన్ని పెంచుతూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటం ఒక కారణంగా ఉంది.
దేశంలో కంపెనీలు పరిస్థితులు చక్కబడగానే వేగంగా విస్తరించేందుకు డీల్స్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆటోమేషన్ తక్కువ ఉద్యోగాలకు దారితీస్తుందని ప్రభుత్వం చాలా కాలం క్రితం నమ్మలేదు.. పారిశ్రామిక విప్లవం సమయంలో ఇలాంటి భయాలు ఉన్నాయి. అయితే కొత్త రకం ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. మరో పక్క స్టార్టప్ కంపెనీల పరిస్థితులు చాలా దారణంగా ఉన్నాయి. మెుత్తానికి టెక్కీలకు 2025 వచ్చేంత వరకు పెద్దగా కెరీర్ అవకాశాలు, గ్రోత్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications