Gold Price: సెప్టెంబర్‎లో కుప్పకూలిన బంగారం ధరలు.. అక్టోబర్‎లో ఇంకా తగ్గుతాయా..!

సెప్టెంబర్‌లో బంగారం ధరలు తీవ్రమైన దిద్దుబాటుకు గురయ్యాయి. ఆ నెలలో ఈ విలువైన పసిడి 6.5 శాతం నష్టపోయింది. జూన్ తర్వాత సెప్టెంబర్ లోనే బంగారం ధర భారీగా తగ్గింది. ఆ నెలలో బాండ్ ఈల్డ్స్ గరిష్ట స్థాయికి చేరడంతో, యూఎస్ ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో పుత్తడి ధరలు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఇండియాలో పండుగలు, వివాహాల సీజన్ సమీపిస్తున్నందున సీజనల్ డిమాండ్, సెంట్రల్-బ్యాంక్ కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అక్టోబర్‌లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, ద్రవ్య లోటులపై ఆందోళనలు టర్మ్ ప్రీమియంలను పెంచడంతో, సెప్టెంబర్‌లో గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి.

అధిక ఈల్డ్స్ రాబడినివ్వని బంగారాన్ని కలిగి ఉండటానికి పెట్టుబడిదారులు ఇష్టపడరు. ఫలితంగా పసిడి ధరలు దగ్గే అవకాశం ఉంటుంది. యూఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ సెప్టెంబర్ 29న 5.293%కి చేరుకుందని Giottus.com సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. ఇది 2007 తర్వాత అత్యధిక స్థాయి. గురువారం డాలర్ ఇండెక్స్ మూడు నెలలకు పైగా గరిష్ట స్థాయికి చేరడంతో బలపడిన డాలర్ కూడా బంగారంపై ఒత్తిడిని పెంచింది. భౌగోళిక రాజకీయ పరిణామాలపై పుత్తడి ధరలు ఆధారపడి ఉంటాయన్నారు. యూఎస్ స్థూల ఆర్థిక డేటా కూడా వడ్డీ రేట్ల అంచనాలను సంక్లిష్టం చేసింది. ఆగస్టు పీసీఈ ద్రవ్యోల్బణం వార్షికంగా 3.4%గా ఉంది. ఇది జూలై కంటే కొద్దిగా ఎక్కువ అయినప్పటికీ, విశ్లేషకుల అంచనాల కంటే 0.3 శాతం పాయింట్లు తక్కువ.

Gold Price

సెప్టెంబర్‌లో ధరలు కొంత తగ్గినప్పటికీ, భారతదేశపు పండుగ, వివాహ డిమాండ్, భౌగోళిక రాజకీయపరమైన రిస్కులు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్ల వల్ల బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ బలపడటం వంటివి ధరలలో వచ్చే భారీ లాభాలను పరిమితం చేసినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడం, స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పసిడికి మద్దతునిస్తూనే ఉన్నాయని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ అన్నారు.

దసరా, ధంతేరస్, దీపావళితో పాటు వివాహాల సీజన్ లో బంగారానికి డిమాండ్ ఉంటుంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో దాదాపు 6% పతనంతో వెనుకబడిన బంగారం, ఇప్పుడు ఔన్సుకు $4,150 వద్ద స్థిరంగా ప్రారంభమైందని మోనార్క్ పిఎంఎస్ అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ ధ్రువ్ జోగ్లేకర్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రమాదాలను అధికం చేస్తూ, ఫెడ్ వడ్డీ రేట్ల మార్గాన్ని అంచనా వేయడాన్ని కష్టతరం చేయడం ద్వారా చమురు ధరలు అనిశ్చితిని పెంచుతున్నాయని కూడా సుబ్బురాజ్ పేర్కొన్నారు. భారతీయ పెట్టుబడిదారులకు రూపాయి ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది, ఎందుకంటే కరెన్సీ బలహీనత దేశీయ బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునే పెట్టుబడిదారులు కచ్చితమైన కనిష్ట స్థాయిని గుర్తించడానికి ప్రయత్నించే బదులు, విడతల వారీగా కొనుగోళ్లు చేయడాన్ని పరిగణించవచ్చని సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+