Gold: బంగారం ధర భారీగా పెరగొచ్చు.. నిపుణుల ఏమంటున్నారు..!
బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,55,660కి చేరింది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.500 పెరిగి రూ.1,42,700 వద్ద ట్రేడవుతుండగా.. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి ధర రూ. 410 పెరిగి రూ.1,16,760 వద్ద కొనసాగుతోంది. భారీగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా.. వద్దా అనే అయోమయంలో కొంత మంది ఉన్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు ఉన్నవారు ఎలాగైనా కొనుగోలు చేయాల్సిందే. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడే పసిడి కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు.
ఈ జనవరిలో బంగారం ధర రూ.1,70,000 వరకు పెరిగింది. ఆ తర్వాత తగ్గుతూ వస్తుంది. మార్చిలో 1.30 లక్షలకు తగ్గింది. అంటే గరిష్టం నుంచి 23 శాతం తగ్గింది. జూన్‌లో కాస్త తగ్గిన బంగారం ధరలు ఆగస్టులో మళ్లీ పెరుగుతున్నాయి. చాలా మంది పసిడి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితి, డాలర్ విలువ, వడ్డీ రేట్లు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీరేటు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు , సురక్షిత పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగినపుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి వైపు మొగ్గు చూపుతారు. సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే. అందుకే బంగారం ధరలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వారు గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బంగారం జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన కొన్ని వారాల్లోనే పసిడి 23 శాతం పతనమైందని గుర్తుంచుకోవాలని నిపుణులుచెబుతున్నారు.
అయితే బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకంతో మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదని సూచిస్తున్నారు. బంగారం మళ్లీ 2 లక్షలకు పెరుగుతుంది అనో, మళ్లీ లక్షకి పడిపోతుందనో ఇలా ఏ దిశగా ఆలోచించినా ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా బంగారం ధర అంచనాల్లో ఒకే లక్ష్యాన్ని చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి సాధారణ పరిస్థితుల్లో సుమారు 5 శాతం అటూ ఇటూ కదిలే అవకాశముందని మాత్రమే తెలిపిందన వివరించింది. ఆర్థిక మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, తక్కువ వడ్డీరేట్ల అంచనాలు కారణంగా బంగారంధర మరింత పైకి వెళ్లే అవకాశముందని అంచనా వేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications