Gold Price: తులం బంగారం రూ.లక్షా 70 వేలకు చేరుకునే అవకాశం..!

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. అయితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సమావేశంలో చేసిన హాకిష్ వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగా గోల్డ్, వెండి ధరల్లో ఊహించని ఒడుదొడుకులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలతో బాండ్ ఈల్డ్స్ పెరిగింది. బంగారం, వెండి ధరలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల వంటి పరిణామాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా లేదా అనేదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అంచనాలు వెల్లడించారు.వెండితో పోలిస్తే బంగారానికే బలమైన సపోర్ట్ కలిగి ఉందని జూలియస్ బేర్ రీసెర్చ్ హెడ్ కార్టెన్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇండస్ట్రియల్ డిమాండ్ మందగించడం, చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి తగ్గటం వంటి అంశాలు వెండిపై ఒత్తిడిని పెంచుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థ మోనార్క్ పీఎంఎస్ 2026 చివరి నాటికి బంగారం, వెండి ధరలపై మూడు భిన్నమైన అంచనాలను ప్రకటించింది.

Gold

ఇందులో భాగంగానే చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత సానుకూలమైన 'బుల్ కేస్' లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. లక్షా52వేల 554 నుంచి రూ.లక్షా 70వేల 861 మధ్యకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈ గరిష్ట అంచనా నిజం కావాలంటే కొన్ని ప్రత్యేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలని పేర్కొంది. అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవలసి రావడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి గోల్డ్ వైపు మళ్లడం వంటి బలమైన కారణాలు తోడైతేనే బంగారం ధర రూ.లక్షా 70వేల 861 స్థాయిని తాకే అవకాశం ఉందని వివరించింది.

ప్రస్తుతానికి మోనార్క్ పీఎంఎస్ 55% ప్రాబబిలిటీ ఉన్న తమ 'బేస్ కేస్' కింద మాత్రం 10 గ్రాముల బంగారం రూ.లక్షా 31వేల170 నుంచి రూ.లక్షా 43వేల 372 మధ్య ట్రేడ్ కావచ్చని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ సవాళ్లు, ఫెడ్ విధానాల ఆధారంగా రాబోయే కాలంలో బంగారం, వెండి ధరల గమనం పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+