Gold Price: వచ్చే రెండు నెలల్లో భారీగా పెరగనున్న బంగారం ధర.. ఇప్పుడే కొనేయడం మంచిదా..!
గతేడాది చివరలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం ధర రూ.1,70,000 దాటింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.1,40,000 నుంచి రూ.1,50,000 మధ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.5 వేలు పెరిగింది. ఇదే స్థాయిలో పెరిగితే తులం బంగారం రూ.1,75,000 చేరుతుందా అని ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
తాజాగా ఔన్స్ బంగారం ధర 4,300 డాలర్లు దాటింది. ఈ వారంలో పసిడి ధర 6 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే. అమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారని వివరిస్తున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మార్కెట్లకు కీలకంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే డాలర్ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు పసిడి ధరలు పరుగులు తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో అమెరికా ఉద్యోగుల డేటా వస్తుంది. ఈ నివేదికలో జూలైలో సుమారు 80 వేల కొత్త ఉద్యోగాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఉద్యోగాల డేటా బాగుంటే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సమయం తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఫేడ్ వడ్డీ రేట్లు పంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా పసిడి ధరలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడ బంగారం ధర ఫెడ్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. మరో వైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ బంగారం కొనుగోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇక.. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సమయం పట్ట అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారం ధర పెరిగితే ఇండియాలో కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు తులం బంగారం ధర రూ.1,50,000 నుంచి రూ.1,60, 000 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications