Gold Price: బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగాల్సిందేనా..!
గత పది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా గత రెండు రోజులుగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి దాదుపు 30 శాతం ధరలు తగ్గాయి. అమెరికన్ డాలర్ బలపడటం, డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్‌లో గురువారం వరుసగా ఎనిమిదవ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ..5120 తగ్గి రూ.1,25,570 వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం ఎంసీఎక్స్ లో బంగారం ధర కీలకమైన మద్దతు స్థాయి అయిన రూ.1,22,000- రూ.1,22,800 వద్ద స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి తగ్గితే..రూ.1,18,000-రూ.1,19,000 మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ పెరిగితే రూ.1,26,300 నుంచి రూ.1,27,000 మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వల్ప కాలంలో పసిడి ధరలు దాదాపుగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు భారీగా తగ్గడంతో గోల్ట్ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో టైటాన్ కంపెనీ, కళ్యాణ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్ షేర్లు 10 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి.

పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు నిలివేయడం, డాలర్ బలపడితే బంగారం మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యం చైనా సెంట్రల్ బ్యాంక్ పసిడి కొనుగోలు నిలిపివేస్తే ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకే సారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్ కోసం పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు తులం, అర తులం చొప్పున కొనుగోలు చేస్తే బెటరని సూచిస్తున్నారు.
ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది. రూ.4 లక్షల స్థాయి నుంచి రూ.1,50,000 లకు చేరింది. MCXలో బంగారం ధర 3.7 శాతం తగ్గగా వెండి ధర 5.2% మేర పడిపోయింది. మార్కెట్ అస్థిరతలకు, పారిశ్రామిక డిమాండ్‌కు సంబంధించిన ఆందోళనలకు వెండి మరింత సున్నితంగా స్పందించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఎంసీఎక్స్ లో వెండి దాదాపు 5.2% క్షీణించిన తర్వాత రూ.1,48,000-1,50,000 మద్దతు జోన్‌లో ఊగిసలాడే అవకాశం ఉంది. వెండి ధర తగ్గితే రూ.1,40,000-1,42,000 తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications