9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
Exide Stock: ఎనర్జీ రంగానికి చెందిన షేర్లలో చాలా కాలంగా బూమ్ కనిపిస్తోంది. దేశంలో విద్యుత్ వాహనాలవైపు ప్రజలు మెుగ్గుచూపుతున్న వేళ బ్యాటరీ స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. ఈ రంగంలోని ప్రముఖ సంస్థ ఎక్సైడ్ షేర్లు సైతం ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తున్నాయి.
వారంలో నాల్గవ ట్రేడింగ్ రోజైన నేడు మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రముఖ బ్యాటరీ తయారీ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లపై విరుచుకుపడ్డారు. దీంతో షేర్ ధర ఇంట్రాడేలో 4.70 శాతం లాభపడి ఒక్కోటి రూ.481.70కి చేరుకున్నాయి. దీంతో కంపెనీ షేర్లలో మెగా ర్యాలీ వరుసగా 9వ రోజున కూడా కొనసాగింది. కేవలం ఈ తొమ్మిది రోజుల్లోనే ఇన్వెస్టర్ల 54 శాతం లాభాన్ని అందుకున్నారు. అలాగే స్టాక్ గడచిన ఏడాది కాలంలో 148 శాతం, రెండేళ్లలో ఏకంగా 200 శాతం రాబడిని అందించింది.

ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాస్తవానికి దక్షిణ కొరియా ఆటోమోటివ్ తయారీదారు హ్యుందాయ్ మోటార్, కియా కార్పొరేషన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల స్థానికీకరణ కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ప్రకటన తర్వాత కంపెనీ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డీల్ అదనపు ఆదాయాన్ని ఆర్జించగలదని, దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఎక్సైడ్ మార్కెట్ ఉనికిని పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా స్టాక్‌పై దాని టార్గెట్ ధరను ఇంతకుముందు రూ.233 నుంచి రూ.485కి పెంచింది. అలాగే కంపెనీ షేర్లపై తన BUY రేటింగ్ కొనసాగిస్తోంది. హ్యుందాయ్, కియాతో EES భాగస్వామ్యం ఎక్సైడ్ సెల్ అభివృద్ధికి గణనీయమైన ధ్రువీకరణను అందిస్తుందని బ్రోకరేజ్ భావస్తోంది. ఈ రెండు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఇండియాలో తమ ఈవీ వాహనాలను విక్రయిస్తున్నాయి. కొత్తగా మరిన్ని మోడళ్లను ఇక్కడి ప్రజల కోసం లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. SVOLT టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో FY25 నాటికి కర్ణాటకలోని బెంగళూరులో Li-ion సెల్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడంలో కంపెనీ ముందంజలో ఉంది.


Click it and Unblock the Notifications