Exicom Tele Systems IPO: నేడు స్టాక్ మార్కెట్లోకి రెండు కంపెనీల ఐపీవోలు అరంగేట్రం చేశాయి. ఈ క్రమంలో తొలుత వచ్చిన కంపెనీ ఇన్వెస్టర్ల డబ్బును మెుదటి రోజే దాదాపుగా రెండింతలు చేసి రికార్డుల మోత మోగించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ ఐపీవో గురించే. నేడు బలమైన జాబితా చేసిన కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో బంపర్ లాభాలను అందించింది. 85 శాతం ప్రీమియం రేటు పలికిన ఐపీవో షేర్ ఎన్ఎస్ఈలో రూ.265 వద్ద, బీఎస్ఈలో రూ.264 వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ షేర్ల అప్పర్ ప్రైస్ బ్యాండ్ రేటును రూ.142గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.429 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.329 కోట్లకు కంపెనీ తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేసింది. మిగిలిన మెుత్తాన్ని ప్రమోటర్ నెక్స్ట్‌వేవ్ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రైజ్ చేసేందుకు 70.42 లక్షల ఈక్విటీ షేర్లను పెట్టుబడిదారులకు విక్రయించారు. కంపెనీలో ప్రమోటర్ గ్రూప్‌ను పరిశీలిస్తే.. నెక్స్ట్‌వేవ్ కమ్యూనికేషన్స్ 76.55% మెజారిటీ వాటాను హోల్డ్ చేస్తుండగా.. HFCL 7.74 శాతాన్ని కలిగి ఉంది. ప్రమోటర్లు సమిష్టిగా ఆక్సికామ్ టెలి-సిస్టమ్స్‌లో 93.28% వాటాను కలిగి ఉన్నారు.
ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ అన్ని వర్గాల్లో పెట్టుబడిదారుల నుండి బలమైన ప్రతిస్పందనను పొందింది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ చివరి రోజున 129.54 సార్లు సభ్యత్వం పొందింది. రిటైల్ కేటగిరీలో 119.59 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ విభాగం 153.22 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ పోర్షన్ 121.80 సార్లు బుక్ చేయబడింది. అలాగే ఇష్యూలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఫిబ్రవరి 26న రూ.178 కోట్లను విజయవంతంగా సమీకరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications