పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకునే వారిలో IT ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను IT చదువులు చదివించాలని, సాఫ్ట్ వేర్ సంబంధాలు తేవాలని భావిస్తుంటారు. కానీ రోడ్డుపక్కన పానీపూరి, మోమోస్ విక్రయించేవారి సంపాదన IT ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువగా ఉందంటే నమ్ముతారా..?
శ్వేతా కుక్రేజా అనే మహిళ తనకు ఎదురైన ఓ సంఘటనను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (ట్విట్వర్)లో షేర్ చేసింది. అమెరికన్ సెమీకండక్టర్, సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ క్వాల్ కామ్ లో పని చేసిన ఓ ఇంజనీర్ ని కలిసినట్లు తెలిపింది. ఆ ఉద్యోగంతో పోలిస్తే క్యాబ్ డ్రైవింగ్ ద్వారా ఎక్కువగా సంపాదించే అవకాశం ఉండటంతో అతడు దానినే ఎంచుకున్నట్లు పేర్కొంది.

మరొక వినియోగదారు పానీపూరివాలా గురించి ఇదే రకమైన కథనాన్ని X యూజర్లతో పంచుకున్నారు. తమ సొసైటీ దగ్గర్లోని పానీపూరి విక్రేత నెలకు 4 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే అతడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం 6వ తరగతి పాస్ అని వెల్లడించారు. ప్రస్తుతం మరో బ్రాంచ్ తెరిచినట్లు చెప్పి షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి వల్ల ఆయా దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. లక్షలాది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. అయితే ఇలా కొలువు కోల్పోయిన సిబ్బంది మరోకొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి బదులు ఇతర రంగాలు, ఫ్రీలాన్సింగ్, సొంత వ్యాపారాలు, వృత్తులపై దృష్టి పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications