Mohandas Pai: ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సేవలు అందించటంలో భారత్ ది సింహ భాగం. అయితే ఇప్పుడు కంపెనీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో. దీనిపై ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఐటీ రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఇందులో నిజమెంత..? పూర్తి వివరాలు ఇప్పుడు గమనిద్దాం..

రూపాయి పతనంతో లాభాలు..
ప్రస్తుతం భారత కరెన్సీ క్షీణత కారణంగా దేశీయ ఐటీ కంపెనీలకు మంచి లాభాలు వస్తున్నాయని ఆయన అన్నారు. రూపాయి క్షీణత కారణంగా తమ ఆదాయంలో 13-14 శాతం పెరుగుదల ఉందని వెల్లడించారు. అయితే.. మంచి లాభాలతో సీనియర్లకు చాలా ఎక్కువ వేతనాలు ఇస్తున్న ఐటీ కంపెనీలు జూనీయర్లకు కూడా అలా చెల్లించొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.

సీఈవోలకు భారీ జీతాలు..
ఐటీ కంపెనీల సీఈవోలు, ఉన్నత స్థాయి ఉద్యోగుల వేతన ప్యాకేజీలు మన ఊహలకు కూడా అందని స్థాయిలో ఉన్నాయి. HCL టెక్ ఇటీవల తన వార్షిక నివేదికలో కంపెనీ CEO C విజయ్‌కుమార్ ఏటా రూ.123 కోట్లను ఇంటికి తీసుకువెళుతున్నారు. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ జీతం 88 శాతం పెరిగి.. రూ.79 కోట్లు అందుకుంటున్నారు. విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే ఏటా రూ.79.8 కోట్లు డ్రా చేస్తున్నారు.

దోపిడీకి గురవుతున్న IT ఫ్రెషర్లు..
ఐటీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కావాలంటే ముందుగా అనుభవం కావాలంటారు. అనుభవం కావాలంటే ముందు ఉద్యోగం కావాలికద. అయితే ఈ క్రమంలో గడచిన 10 ఏళ్లుగా IT ఫ్రెషర్లను కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ అన్నారు. భారీగా ఉద్యోగుల రాజీనామాలకు, ఆఫీసులకు రావటానికి నిరాకరించటం వంటి అనేక సమస్యలకు కారణమైందని నొక్కి చెప్పారు. ఫ్రెషర్లకు 2008-09లో కంపెనీలు చెల్లిస్తున్న రూ.3.5-3.8 లక్షలనే చెల్లిస్తున్నాయన్నారు.
వాళ్లను మనుషుల్లా చూసుకోండి..
వేతనాల విషయంలో ఏదైనా త్యాగం చేయవలసి వస్తే సీనియర్లు వాటిని చేయాలని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ అన్నారు. మీరు జూనియర్‌లకు ఎక్కువ చెల్లించనప్పుడు సీనియర్ వ్యక్తి జీతం ఎలా పెంచుతారని అన్నారు. జూనియర్లను కూడా మనుషుల్లా చూడాలని.. వారిపై చిన్నచూపు తగదని పేర్కొన్నారు. పిరమిడ్ దిగువన ఉన్న వ్యక్తులను గమనించాలని అన్నారు. ప్రస్తుత విధానం కొనసాగితే ఐటీ కంపెనీలు "కిరాయి సంస్థలు"గా మారతాయని పాయ్ నొక్కి చెప్పారు.

మూన్‌లైటింగ్.. వివాదం..
ప్రస్తుతం టెక్కీలు ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో పనిచేస్తూనే.. మరో కంపెనీలో అసైన్‌మెంట్‌లను చేయటం, ఇతర కంపెనీలకు ఫ్రీలాన్సింగ్ చేయటం మోసమైనదని విప్రో ఎగ్జిక్యూటివ్ CEO రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు. అయితే దీనిపై అనేక మంది స్పందిస్తున్నారు. మిస్టర్ రిషద్ ప్రేమ్‌జీ మీరు ఒకేసారి 7 కంపెనీలకు డైరెక్టర్ గా ఉండటం మూన్‌లైటింగ్ కాదా అని అనుస్తున్నారు. అయితే ఈ మూన్‌లైటింగ్ పద్ధతిని మోహన్‌దాస్ పాయ్ సమర్థించారు.


Click it and Unblock the Notifications