Sahara: సహారా కంపెనీలో జరిగిన కుంభకోణం చాలా మంది జీవితాల్లో చీకటిని నింపింది. అది జరిగి ఏళ్లు గడుస్తున్నా ప్రజలు వాటి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరికొందరైతే ప్రాణహానితో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మరిన్ని చిక్కులు..
సహారా ఇండియా కంపెనీ చీఫ్ సుబ్రతా రాయ్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మరిన్ని ఇబ్బందులు పెరుగుతున్నాయి. గతంలో సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ కు సెబీ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా రూ.6.48 కోట్లను డిపాజిట్ చేయాలని అందులో ఆదేశించింది. దీనిని మరువక మునుపే కంపెనీ యాజమాన్యంతో సహా 22 మందిపై తాజాగా మరో కేసు నమోదైంది.

రాజస్థాన్ లో..
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై ఒక మహిళ కేసు నమోదు చేసింది. ఆర్తీ అగర్వాల్ రాయ్ అనే మహిళ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈమె గతంలో కంపెనీ సీనియర్ మోటివేటర్ గా సహారా గ్రూప్ లో పనిచేసింది. ఆ సమయంలో మెుత్తం రూ.2.5 కోట్లను డిపాజిట్లు చేయించింది. సహారా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఈ డబ్బు తిరిగి రాకపోవటంతో ఆర్తి యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేసింది. తెలిసిన వారు, కుటుంబ సభ్యులను సహారాలో పెట్టుబడులు పెట్టేలా ఆర్తీ అప్పట్లో ఒప్పించింది.

సీన్ రివర్స్..
పిల్లల చదువులు, కూతురి పెళ్లి, సొంతింటి కల అంటూ అనేక చిన్నచిన్న లక్ష్యాల కోసం ఇందులో పొదుపు చేసిన డబ్బు తిరిగి రాకపోటంతో ఇన్వెస్ట్ చేసిన వారు ఆర్తీ కుటుంబంపై బెదిరింపులకు దిగారు. తమ డబ్బు ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించాలంటూ వారు ఆమెపై ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో కుటుంబానికి బెదిరింపులు పెరిగాయి. తనకు ప్రాణహాని ఉందంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కంపెనీ యజమాని సహా 22 మందిపై 13 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

దేశంలో చాలా మంది..
ఇలాంటి సంఘటనలు కేవలం ఆర్తీ ఒక్కరు ఎదుర్కొంటున్నది మాత్రమే కాదు. తెలిసిన వారితో పెట్టుబడులు పెట్టిందిన వేల మంది ప్రస్తుతం ఇలాంటి స్కామ్స్ లో మధ్యవర్తులుగా ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఈ మోసం ద్వారా మెుత్తం రూ.2.5 కోట్ల మేర కంపెనీ మోసం చేసిందంటూ చేసిన ఫిర్యాదును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ దినేష్‌కుమార్ చౌదరి తెలిపారు. అయితే సహారా గ్రూప్ మీద దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి కేసుల్లో ఇదే మెుదటిది కాదు. సహారాలో పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఇరుక్కుపోయిన చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. తమ కష్టార్జితం తిరిగి తమకు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications