Real Estate News: ఎవర్‌గ్రాండేకు హాంగ్‌కాంగ్ కోర్టు గట్టి షాక్.. ముదిరిన చైనా రియాల్టీ సంక్షోభం
China Realty: కొన్నేళ్లపాటు ప్రపంచ కర్మాగారంగా పేరుగాంచిన చైనాలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించింది. తాజాగా హాంకాంగ్ కోర్టు ఇచ్చిన తీర్పు డ్రాగన్ కంట్రీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే గ్రూప్‌ను లిక్విడేషన్ చేయమని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. తీవ్రమవుతున్న సంక్షోభాన్ని నియంత్రించడానికి డ్రాగన్ విధాన నిర్ణేతలు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. వైండింగ్-అప్ ఆర్డర్ తర్వాత ఎవర్‌గ్రాండే ప్రాపర్టీ సర్వీసెస్‌లో స్టాక్ ట్రేడింగ్ నిలిచిపోయింది.

333 బిలియన్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన ఎవర్‌గ్రాండే.. చైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఆ దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడమే కాకుండా వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయింది. వైండ్-అప్ అయిన కంపెనీని ప్రొవిజనల్ లిక్విడేటర్లు నిర్వహిస్తారని న్యాయమూర్తి లిండా చాన్ తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ హుయ్ కా యాన్ నియంత్రణతో పాటు సమస్యల పరిష్కరానికి వారు కృషి చేస్తారని వెల్లడించారు.
నేరాలకు పాల్పడినట్లు అనుమానంతో సెప్టెంబరులో హుయ్ ను పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో సంవత్సరాల చర్చల తర్వాత కూడా రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన విఫలమయ్యారు. డిసెంబర్ 2021లో డాలర్ బాండ్‌పై మొదటిసారి ఎవర్‌గ్రాండే డిఫాల్ట్ అయింది. అనంతరం ఇంటర్‌షోర్ కన్సల్ట్ లిమిటెడ్‌కి చెందిన టాప్ షైన్ గ్లోబల్ లిమిటెడ్.. జూన్ 2022లో లిక్విడేషన్ కోసం పిటిషన్ దాఖలు చేసింది.


Click it and Unblock the Notifications