World Cup 2023: భారతీయులకు క్రికెట్ అంటే అమితమైన ప్రేమ. పైగా నేడు వరల్డ్ కప్ ఆఖరి మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దీనికోసం నిర్వాహకులు కోట్లు కుమ్మరించారు.
ఈ క్రమంలోనే ICC క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రస్తుతం దశకు చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లకు రూ.80 కోట్ల వరకు బీమా తీసుకున్నారు. బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా మాత్రమే 48 మ్యాచ్‌లలో మొత్తం రూ.1,800 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంది. వాస్తవానికి ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం దీని వల్ల భారీగానే లాభాలను ఆర్జించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే టోర్నమెంట్‌లోని చాలా మ్యాచ్‌లలో పెద్దగా నష్టాలను వాటికి కలిగించలేదు. ప్రపంచ కప్‌కు ముందు వాతావరణం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం వల్ల ఆసియా కప్ క్లెయిమ్‌లను ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ ఈవెంట్ కోసం బ్రాడ్‌కాస్టర్ మాత్రమే చెల్లించిన ప్రీమియం దాదాపు రూ.64 కోట్లు అని ఇన్సూరెన్స్ పరిశ్రమ మూలాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిందించి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశం పాల్గొన్న మ్యాచ్‌లపై ప్రత్యేకించి అధిక వాటాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల బీమా కవరేజీ రూ.80 కోట్లకు చేరుకుంది. అసలు క్రికెట్ మ్యాచ్ లకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా అని చాలా మంది ఈ వార్త చూసిన వారి ఆశ్చర్యానికి గురవుతుంటారు. కానీ అది వాస్తవమే. ఎందుకంటే ఈ ఈవెంట్లను వేల కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తుంటారు. అందుకే నష్టాలు రాకండా ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు.
వాస్తవానికి గతంలో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌తో పోలిస్తే ఈ ప్రపంచకప్‌లో చాలా తేడా వచ్చిందని వెల్లడైంది. టోర్నమెంట్ బ్రాడ్‌కాస్టర్‌లు, స్పాన్సర్‌లు, స్టేడియం హక్కులు, సంఘాలు ఇన్సూరెన్స్‌లో 2011 కంటే చురుకుగా ఉన్నారు. 2011లో భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన తర్వాత దాదాపు 12 ఏళ్లకు మరోమారు అవకాశం లభించింది. దీంతో ఈవెంట్ వాటాదారులు అగ్రశ్రేణి ప్రైవేట్ బీమా కంపెనీలతో పాటు ప్రముఖ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ వద్ద తమ పాలసీలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications