Gold: బంగారం ధర తులానికి రూ.1,70,000కు చేరుతుందా.. దిగుమతి తగ్గినా ధరలు మాత్రం పెరుగుతున్నాయి..!

బంగారం ధర భారీగా పెరుగుతోంది. తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ వారం భారీగా పెరిగింది. ప్రస్తుతం తులం 24 క్యారెట్ల బంగార ధర రూ.1,52,350 వద్ద ట్రేవడవుతోంది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,39,650 పలుకుతుంది. అలాగే తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,14,260 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. అయితే ధరల పెరుగుదల, పన్నుల నేపథ్యంలో భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయని వివరిస్తున్నాయి.

2021-22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025-26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం చెప్పింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

Gold

మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడం కూడా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు చెబుతున్నారు. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు వివరిస్తున్నారు. అయితే బిల్లు లేని బంగారం కొనుగోలు కూడా పెరుగుతున్నట్లు గుర్తు చేస్తున్నారు. పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది.

2021-22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025-26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం బంగారం ధర భారీగా పెరగడమే. దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయిందని ఓ నివేదిక పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఔన్స్‌ బంగారం ధర 2,000 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు ఔన్స్ బంగారం 4,200 డాలర్లకు చేరింది. ఈ ఐదేళ్లలో పసిడి ధర 100 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే పసిడి ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం ధర తులానికి రూ.1,70,000 చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+