retirement news: చిన్నమొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌తో బిగ్ కార్పస్.. లక్ష పెట్టుబడి కూడా వండర్స్ చేస్తాయ్..
small investments: వృద్ధుల పట్ల నిరాదరణ పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పదవీ విరమణ నాటికి మంచి కార్పస్ ఫండ్ రూపొందించుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 60 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్ జీవితాన్ని మధురంగా ఆస్వాదించేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ రేంజ్‌లో పెట్టుబడులు అవసరం లేకుండా సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గాలు వెతుకుతున్నారు.
పెట్టుబడి విషయంలో కాలానికి అధిక ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని మొదటగా గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీని ఆధారంగానే ఇన్వెస్ట్‌మెంట్స్ లో అద్భుతాలు చూడవచ్చని చెబుతున్నారు. పెట్టుబడి ఎదగడానికి తగినంత సమయం ఇస్తే ఊహించని రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చని, ఇందుకు ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరమని సలహా ఇస్తున్నారు.

కేవలం 1 లక్ష పెట్టుబడితో రిటైర్‌మెంట్ నాటికి 1 కోటి కార్పస్ సృష్టించడం సాధ్యమే అంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. 12 శాతం వార్షిక రాబడిని ఊహిస్తే, 60 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి 1 లక్ష పెట్టుబడి విలువ మారుతూ పోతుంది. ఇన్వెస్ట్ చేసే సమయానికి వ్యక్తి వయస్సు ఎంత అనే దానిపై ఈ విలువ ఆధారపడి ఉంటుందని గమనించాలి.
20 ఏళ్ల వయస్సులో 1 లక్ష పెట్టుబడి పెడితే దాని వృద్ధి సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారని విశ్లేషకులు లెక్కగడుతున్నారు. 60 సంవత్సరాలు వచ్చే సరికి ఈ పెట్టుబడి దాదాపు 100 రెట్లు పెరిగి ఏకంగా 1 కోటికి చేరుకుంటుంది. ఈ 40 సంవత్సరాల నిరంతరాయ వృద్ధి నుంచి భారీగా ప్రయోజనం పొందుతుంది. అదే 30 సంవత్సరాల సమయంలో పెడితే కేవలం 30 రెట్లు మాత్రమే పెరిగి లక్ష ఇన్వెస్ట్‌మెంట్ 30 లక్షలుగా మారుతుంది. ఇక 40 ఏళ్ల వయస్సులో పెడితే అది అదనంగా కేవలం 9 లక్షలను మాత్రమే జనరేట్ చేస్తుంది.
చిన్న వయస్సులోనే ప్రారంభించే పెట్టుబడులు భారీ ప్రయోజనాన్ని పొందుతాయి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తుండటంతో గణనీయంగా ఎక్కువ రాబడి లభిస్తుంది. తద్వారా 1 లక్ష వంటి చిన్న మొత్తం కూడా 20 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే 1 కోటి సంపదగా రూపాంతరం చెందుతుంది. ఈక్విటీలు లాంగ్ రన్‌లో ఇతర ఆస్తుల కంటే ఎక్కువ రాబడిని ఇస్తాయని అనలిస్టులు సూచిస్తున్నారు. రిస్క్ ప్రొఫైల్ ప్రకారం ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా ఆధారంగా మంచి ఫండ్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications