దేశంలో పని గంటలపై జరుగుతున్న చర్చల్లో భాగంలో ఇప్పుడు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కూడా వచ్చి చేరారు. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో పూనావాలా వర్క్ క్వాలిటీ అండ్ లైఫ్ బ్యాలెన్స్ పై ఉద్ఘాటించారు. ఒక విధంగా SN సుబ్రమణియన్ చేసిన ప్రకటనలకు ఆనంద్ మహీంద్రా స్పందనకు అదార్ పూనావాలా రిప్లయ్ ఇచ్చాడు. అదార్ పూనావాలా చేసిన ట్వీటులో "అవును ఆనంద్ మహీంద్రా జీ, నా భార్య నటాషా పూనావాలా కూడా నన్ను అద్భుతంగా భావిస్తుంది. ఆమె ఆదివారం కూడా నన్నే చూస్తుంటుంది. ఎల్లప్పుడూ పని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి, పరిమాణానికి కాదు అని అన్నారు.
ఆనంద్ మహీంద్రా ప్రకటనకు సపోర్ట్ గా
అదర్ పూనావాలా చేసిన ఈ ట్వీట్ ఆనంద్ మహీంద్రా ప్రకటనకు రిప్లయ్ గా వచ్చింది, ఇందులో సైజ్ కంటే పని నాణ్యత ముఖ్యమని మహీంద్రా పేర్కొన్నారు. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చేయవచ్చని మహీంద్రా పేర్కొన్నారు. కుటుంబం ఇంకా మీ కోసం మీకు సమయం లేకపోతే, మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పాడు.

90 గంటల పై వివాదం:
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటలు పని చేయాలనే సూచనతో పని గంటలపై చర్చ మొదలైంది. దీని తరువాత, ఇటీవల L&T చైర్మన్ SN సుబ్రమణియన్ వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారం సెలవు తీసుకోవద్దని సూచించారు. మీ భార్యను ఇంట్లో ఎంతసేపు చూడగలరు అంటూ అన్నారు. దింతో ఈ చర్చ కొత్త వివాదానికి దారితీసింది. ఈ తరుణంలోనే ఆనంద్ మహీంద్రా ఈ మాటలను పరోక్షంగా తిప్పికొట్టారు. అంతేకాదు దీనికి సంబంధించి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పాడుకొనే కూడా స్పందించారు.
షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయమూర్తి
ఇది మాత్రమే కాదు, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ L&T ఛైర్మన్ SN సుబ్రమణియన్ ప్రకటనపై విరుచుకుపడ్డారు. "సార్, భార్యాభర్తలు ఒకరినొకరు చూడకపోతే, మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎలా ఉంటాము?" అంటూ ట్వీట్ చేసారు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం ముఖ్యం..
ప్రస్తుతానికి ఈ చర్చ ఇక్కడితో ఆగడం లేదు. ఆనంద్ మహీంద్రా అండ్ పూనావాలా వంటి అనుభవజ్ఞులు పని పరిమాణంపై మాత్రమే దృష్టి పెట్టకుండా జీవితంలో వర్క్ బ్యాలెన్స్ సృష్టించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆనంద్ మహీంద్రా పని నాణ్యత అండ్ వ్యక్తిగత అభివృద్ధిని నొక్కిచెప్పగా, పూనావాలా తన ట్వీట్ ద్వారా పని నాణ్యత ముఖ్యమని మెసేజ్ ఇచ్చారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications