అమెరికా-భారత్ వ్యాపార సంబంధాలు ఈ మధ్య పెంచినా టారిఫ్స్ వల్ల గందరగోళంగా ఉన్నా, అమెరికన్ టెక్ కంపెనీలు మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ లాంటి కంపెనీలు భారత మార్కెట్‌లో హైరింగ్ జోరుగా పెంచేస్తున్నాయి. గత ఏడాది ఈ కంపెనీలు మొత్తం కలిపి 30 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాయి. ఇది గత మూడు సంవత్సరాల్లోనే రికార్డు స్థాయి వృద్ధి.

Xpheno డేటా ప్రకారం, FAAMNG గ్రూప్ (ఫేస్‌బుక్/మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) 2024 ఆగస్ట్ నుండి 2025 ఆగస్ట్ వరకూ 30% ఎక్కువ హైరింగ్ చేసింది. 2022లో ఒక్కసారిగా 37 వేలమంది తీసుకున్నప్పటికీ, అది ఎక్కువగా కోవిడ్ తర్వాత వచ్చిన రిక్రూట్‌మెంట్ క్రేజ్ వల్లే. కానీ ఇప్పుడు మాత్రం ప్లాన్‌డ్‌గా, క్యాపబిలిటీ-బేస్డ్‌గా జాబ్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తే, "ఎవ్వరినైనా తీసుకోవడం" కాదని, "సరైన స్కిల్ ఉన్నవాళ్లను మాత్రమే ఎంచుకోవడం" అన్న దానిపైనే కంపెనీల ఫోకస్ ఉంది. దీనినే సామర్థ్యం మీదే మొదటి నియామకం అంటారు.
టీమ్‌లీజ్ డిజిటల్ CEO నీతి శర్మ చెప్పినట్టు, కంపెనీలు ఇప్పుడు AI, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి కీలక రంగాల్లో బలమైన టీమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే, జస్ట్ హెడ్‌కౌంట్ పెంచడం కాదు... స్కిల్స్‌తో కూడిన టీమ్‌లను డెవలప్ చేయడం లక్ష్యం.
Xpheno కో-ఫౌండర్ కమల్ కారంత్ కూడా అదే చెబుతున్నారు ఎక్కువ అవకాశాలు ఇంజినీరింగ్, IT, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ లాంటి మధ్య-సీనియర్ రోల్స్‌కే వస్తున్నాయి. ప్రస్తుతానికి 5,200 ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి, ఇది 2021-22లో శిఖరంలో ఉన్న 10-11 వేల ఉద్యోగావకాశాలతో పోలిస్తే సగం కూడా కాదు.
హైరింగ్ మాత్రమే కాదు, ఆఫీస్ విస్తరణలతో కూడా అమెరికన్ కంపెనీలు భారత్‌పైనే బలంగా దృష్టి పెడుతున్నాయి.
- OpenAI తన మొదటి ఆఫీస్‌ని న్యూఢిల్లీలో ప్రారంభించబోతోంది.
- Microsoft హైదరాబాద్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెకు తీసుకుంది.
- Apple బెంగుళూరులో 10 ఏళ్ల లీజ్‌తో రూ.1,010 కోట్లు ఖర్చు చేసి ఆఫీస్ ఫ్లోర్స్ తీసుకుంది.
- Meta బెంగుళూరులో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది.
- Google కూడా 'Ananta' అనే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌లలో ఒకదాన్ని బెంగుళూరులో లాంచ్ చేసింది.
అంటే స్పష్టంగా అమెరికన్ కంపెనీలు కేవలం ప్రతిభను వాడుకోవడమే కాదు, భారత్‌లోనే తమ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాయి. అమెరికా-భారత్ మధ్య ఎంత ఉద్రిక్తతలు ఉన్నా, అమెరికన్ టెక్ కంపెనీలు భారత్‌లో హైరింగ్ తగ్గించడం లేదు. వాళ్ల దృష్టి ఇప్పుడు భారత ప్రతిభను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లడంపై ఉంది.
మనకి ఇక్కడ వచ్చే మెసేజ్ చాలా సింపుల్ స్కిల్స్‌ని పెంచుకోవడమే అసలైన ఇన్వెస్ట్మెంట్. AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటి డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాల్లో కాస్త టైం, ఎఫర్ట్ పెట్టితే, వచ్చే కొన్నేళ్లలోనే గ్లోబల్ లెవెల్ అవకాశాలు మన ముందుంటాయి.
భారత్ అమెరికన్ టెక్ కంపెనీలకు టాలెంట్ హబ్ మాత్రమే కాదు, పెద్ద మార్కెట్ కూడా. ఇక్కడి టెక్ టాలెంట్ తక్కువ ఖర్చుతో, మంచి స్కిల్స్‌తో దొరుకుతుంది. అదే సమయంలో డిజిటల్ ఎకానమీ బాగా పెరుగుతుండటంతో కొత్త యూజర్లు కూడా వేగంగా చేరుతున్నారు. కాబట్టి టాలెంట్ + మార్కెట్ + పాలసీలు అన్నీ కలిపి భారత్‌ని టెక్ దిగ్గజాలకి తప్పనిసరి డెస్టినేషన్‌గా మార్చేశాయి.
భారత్‌లో టెక్ పాలసీలు కూడా అమెరికన్ కంపెనీలకు ప్లస్‌గానే మారుతున్నాయి. డిజిటల్ ఇండియా, AI మిషన్, 5G రోల్‌ఔట్, స్టార్టప్ ఫ్రెండ్లీ పాలసీలు వంటివి అడ్డంకి కాకుండా కొత్త అవకాశాలే ఇస్తున్నాయి. ఉదాహరణకి, డేటా సెంటర్స్‌ని ఇక్కడే పెట్టుకోవాలని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుండటంతో, వాళ్ల లాంగ్‌టెర్మ్ ప్లాన్స్‌కు ఇది బాగానే సపోర్ట్ అవుతోంది.
అదే సమయంలో, హైరింగ్ ప్యాటర్న్‌లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతుంటే, మిడ్-సీనియర్ రోల్స్ మాత్రం పెరుగుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే, కంపెనీలు ఇకపై కేవలం సపోర్ట్ వర్క్ కోసం కాకుండా, ఇన్నోవేషన్ డ్రైవ్ చేయడానికి ఇక్కడి టాలెంట్‌ను వాడుకుంటున్నాయి. అంటే, "సపోర్ట్ సెంటర్" అనే ట్యాగ్ నుంచి బయటపడుతూ, భారత్ ఇప్పుడు ప్రొడక్ట్ ఇన్నోవేషన్ హబ్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటోంది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications