బిజీ లైఫ్స్‌లో మనం ప్రతి రోజు ఆఫీస్‌కి వెళ్ళాలంటే సొంత వాహనం లేదా బస్, ఆటోలో వెళ్ళాలి అనుకుంటాం. అలానే, బెంగళూరులో ఒక ఇంజినీర్ ఆకాశ్ ఆనందాని అక్టోబర్ 4న తన ఆఫీస్‌కి వెళ్ళడానికి ఆటోను ఎంచుకున్నాడు. కానీ ఆ ఆటోలో కూర్చొని డ్రైవర్ ను చూసి ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆకాశ్ చెప్పినట్టు, ఆటో డ్రైవర్ చేతికి ఒక ఆపిల్ వాచ్ , చెవిలో ఎయిర్‌పాడ్‌లు ఉండటం గమనించి, ఆసక్తితో అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆటో డ్రైవర్ మామూలుగా చెప్పిన విషయాలు వింటేనే ఆకాష్ షాక్ లో ఉండిపోయాడు. అతనికి రెండు ఇళ్లు ఉన్నాయి, వాటి విలువ సుమారు రూ. 4-5 కోట్లుగా ఉండగా, వాటి అద్దెలు నెలకు రూ. 2-3 లక్షల వరకు వస్తాయి. అదేవిధంగా అతను ఒక AI స్టార్టప్‌లో ఇన్వెస్టర్ కూడా కానీ దీనితో పాటుగా అతను వారాంతాల్లో ఆటో డ్రైవ్ చేయడం తన "ఫస్ట్ జాబ్" మాత్రమే అని చెప్పాడు. దీన్ని ఆకాశ్ X లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ కొన్ని గంటల్లో "1,300 లైక్స్" మరియు "58,000 వీక్షణలు" రాబట్టింది. నెటిజన్స్ అభిప్రాయాలు ఆశ్చర్యం, నమ్మకం లేకపోవడం, సరదా కామెంట్లు ఇలా విభిన్నంగా ఉన్నాయి. ఒకరు ఇలా కామెంట్ చేసారు "ఇదే బెంగళూరు స్టార్టప్ నగరం... ఇక్కడ ఆటో డ్రైవర్స్ కూడా ఇన్వెస్టర్లు!". మరొకరు "బాలీవుడ్ ర్యాగ్స్-టు-రిచెస్ స్క్రిప్ట్ లాగా ఉంది." దానికి ఆకాష్ ఇది నిజమైన కథ అని సమాధానం ఇచ్చాడు.
ఇంకొంతమంది నెటిజన్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ఒకరు, "అతను ఇన్వెస్టర్ అయితే నిజంగా నమ్మదగిన విషయం, ఫౌండర్ అని చెప్పటం కేవలం చర్చలో ఫన్ కోసం మాత్రమేనా అని అన్నారు. మరొకరు, ఆటో డ్రైవర్‌గా ఉండడం అతనికి పెట్టుబడులు పెట్టే ఫౌండర్స్‌ను కలిసే మార్గం మాత్రమే. ఇంకో నెటిజన్, "బెంగళూరులో కొంతమంది హై ఎర్నింగ్ వ్యక్తులు హాయిగా ఆటో డ్రైవ్ చేస్తారు, డబ్బు కోసం కాదు, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి" అని తెలిపారు. నెటిజన్స్ మిశ్రమ అభిప్రాయాలతో ఈ కథను చూసి ఆశ్చర్యపోతూ, కొందరు సవాళ్లు కూడా విసిరారు.
మనకు చాలా సార్లు ఆటో డ్రైవర్ అంటే సాదాసీదా జీవితం, చిన్న వసతి, రోజువారీ రొటీన్ బతకడం అని అనిపిస్తుంది. కానీ బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ కథ మన ఊహలని పూర్తిగా మార్చేస్తుంది. జీవితశైలి చూసి ధనవంతులు అని అనుకోవద్దు. ఈ డ్రైవర్ సాధారణంగా కనిపించినా, అతని ఇళ్లు, అద్దె ఆదాయం, AI స్టార్టప్‌లో పెట్టుబడులు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బెంగళూరులోని "హసిల్ కల్చర్"ని కూడా సూచిస్తుంది. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక్క ఆదాయ మార్గం మీద ఆధారపడడు, ఇలా అన్నీట్లో ఆదాయం పెంచుకుంటారు. జీవనశైలి మాత్రమే చూసి మనం వ్యక్తుల ఆర్థిక స్థితిని అంచనా వేయకూడదు. ఈ కథ మనకి ఎం చెబుతుందంటే ఎంత డబ్బు ఉన్నా, ఎల్లప్పుడూ ఏదో పని చేస్తూ ఉండటం మంచిదని చెబుతుంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications