Train Ticket Booking: రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైనా రైలు బయల్దేరే 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు..!

భారత్ లో ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేస్తారు. రైళ్లలో ప్రయాణిస్తే ఖర్చు తక్కువగా ఉండడంతో రోజు లక్షల మంది ప్రయాణం చేస్తారు. అయితే ఒకప్పటి రైల్వే వ్యవస్థ ఇప్పటి రైల్వే వ్యవస్థకు తేడా చాలా ఉంది. ఎన్నో మార్పులు చేసుకుంటూ రైల్వేను అభివృద్ధి చేస్తున్నారు. కొత్త రైళ్లను తీసుకురావడంతో పాటు అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. అంతేకాకుండా వందే భారత్ రైళ్లను కూడా తీసుకొచ్చారు. భవిష్యత్ లో బుల్లెట్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

అయితే రైళ్లలో ప్రయాణించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. కొన్ని రైళ్లలో అయితే నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే రైల్వే శాఖ ఆ కాలాన్ని తగ్గించింది. అంతేకాకుండా రైలు రిజర్వేషన్ చార్ట్ పూర్తి అయిన తర్వాత ఖాళీ సీట్లను కూడా బుక్ చేసుకోవచ్చని వార్త కథనాలు వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఇతర రిజర్వ్డ్ రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా, ఖాళీగా ఉన్న సీట్లను ఇప్పుడు రైలు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు వరకు బుక్ చేసుకోవచ్చని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

train

ఇప్పటివరకు రిజర్వేషన్ చార్ట్ సిద్ధం కాగానే బుకింగ్ అవకాశాలు మూసుకుపోయేవి. దీంతో ఖాళీ సీట్లు ఉపయోగించకుండానే ఉండిపోయి, చివరి నిమిషంలో ప్రయాణించే వారికి చాలా తక్కువ ఎంపికలు ఉండేవి. అయితే కొత్త విధానం ప్రకారం చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీగా మిగిలిపోయిన ఏ సీట్లనైనా రైలు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఖాళీ సీట్లను తగ్గడంతో పాటు, అత్యవసరంగా లేదా అనుకోకుండా ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు సులువుగా బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది.

IRCTC వెబ్‌సైట్, IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. చార్ట్ ఖరారు అయిన తర్వాత సీట్లు నిజంగా ఖాళీగా ఉంటేనే బెర్త్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే రైల్వేలో ఇంకా అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలా మంది చెబుతున్నారు. కాగా దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను క్రమంగా పెంచనున్నారు. ఇప్పటికే హౌరా నుంచి కామాఖ్య మధ్య మొదటి స్లీపర్ రైలు విజయవంతంగా నడుస్తోంది. దేశంలో మరో 9 రూట్లలో ఈ లగ్జరీ స్లీపర్ రైళ్లను తీసుకురావడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ లిస్ట్‌లో మన తెలుగు రాష్ట్రాల రూట్ కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+