IPO News: ఈవీ కంపెనీ నుంచి రూ.4,500 కోట్ల ఐపీవో.. ఇన్వెస్టర్స్ బెట్టింగ్ కోసం గెట్ రెడీ..
Ather Energy IPO: ఈవీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ఒకదాని తర్వాత మరొకటి దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమౌతున్నాయి. గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా రూ.6,145 కోట్ల ఐపీవోను విజయవంతం చేసిన తర్వాత అదే దారిలో ఏథర్ ఎనర్జీ రంగంలోకి దిగింది.
ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ మేకర్ ఏథర్ తాజాగా రూ.4,500 కోట్ల ఐపీవోకు శ్రీకారం చుట్టింది. ఇందులో రూ.3,100 కోట్లకు తాజా ఇష్యూ ఉంటుందని కంపెనీ వెల్లడించగా, మిగిలిన రూ.1,400 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఇష్యూ ఉంటుందని కంపెనీ తన సెబీ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. సెబీ సోమవారం దాఖలు చేసిన వివరాల ప్రకారం 37.2 శాతం వాటాను కలిగి ఉన్న ప్రధాన ప్రమోటర్ హీరో మోటోకార్ప్, వ్యవస్థాపకులు పెట్టుబడిదారుల్లో కొంతమంది వాటాలను ఉపసంహరించుకోవాలని చూస్తున్నందున ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.2 కోట్ల షేర్లను విక్రయించబడుతున్నాయి.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏథర్ ఎనర్జీ ప్రమోటర్లు తరుణ్ సంజయ్ మెహతా, స్వప్నిల్ బబన్‌లాల్ జైన్ 10 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించటం గమనార్హం. అలాగే IIT మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, IIT మద్రాస్ రూరల్ టెక్నాలజీ, బిజినెస్ ఇంక్యుబేటర్ కూడా వాటాలను విక్రయిస్తున్నాయి. తాజా ఇష్యూ నుంచి సమీకరించిన నిధులను కంపెనీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొనసాగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు కొత్త తయారీ కేంద్రాన్ని స్థాపించటానికి వినియోగించాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏథర్ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదని కంపెనీ భావిస్తోంది.
దీనికి తోడు కంపెనీ సమీకరిస్తున్న నిధుల్లో కొంత భాగాన్ని రుణాల చెల్లింపులకు సైతం వినియోగించాలని చూస్తోంది. ఏథర్ ఎనర్జీ తయారీ కేంద్రం తమిళనాడులోని హోసూర్‌లో ఉంది. ఇదే క్రమంలో కంపెనీ మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో మరో తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్లాన్ చేయటం పెరిగిన కంపెనీ మార్కెట్ కు అద్ధం పడుతోంది. దేశంలో కంపెనీ బలమైన ఆటోమోటివ్ సరఫరాదారుగా ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ చర్యలు ఓలా ఎలక్ట్రిక్ వంటి పెద్ద ఆటగాళ్లతో పోటీ పడేందుకు కంపెనీకి భారీ మద్ధతును అందించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్టర్ల చూపు ఏథర్ ఐపీవోపై కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications