Ola BOSS 72-hour Rush: దేశీయ ఈవీ స్కూటర్ల మార్కెట్లో భారీ పోటీ ఉన్నప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ మెుదటి స్థానాన్ని సుస్థిరంగా కొనసాగిస్తోంది. పండుగల సీజన్ మెుదలైన తర్వాత ఈవీల సేల్స్ పెంచుకునే క్రమంలో కంపెనీ ఇటీవల వరుస ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే S1 కేటగిరీ మోడళ్లపై రూ.30,000 వరకు తగ్గింపుతో విక్రయాలు ప్రారంభించింది. అలాగే కొనుగోలుదారులకు మరో రూ.25 వేలు విలువైన అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
అతిపెద్ద ప్యూర్-ప్లే EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పండుగ సీజన్ కోసం అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా 'BOSS 72-గంటల రష్'ని ప్రకటించింది. ఇది ఈవీ కొనుగోలుదారులకు అక్టోబర్ 10 నుంచి 12 వరకు అందుబాటులో ఉండనుంది. దీనికింద రోజూ అందుబాటులో ఉండే లిమిటెడ్ స్టాక్ వినియోగదారులు S1 X 2kWh స్కూటర్లను రూ.49,999కే సొంతం చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ కేటగిరీ మోడళ్లపై గరిష్ఠంగా రూ.25,000 తగ్గింపుతో పాటు మరో రూ.5000 ఎక్చేంజీ బోనస్ ప్రకటించింది. ఇదే క్రమంలో అదనపు ప్రయోజనాలైన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, ఛార్జింగ్ క్రెడిట్‌లు సహా గరిష్టంగా రూ.25,000 విలువైన ప్రత్యేక డీల్‌లను అన్‌లాక్ చేయండి.

ఓలా ఎలక్ట్రిక్ విభిన్న శ్రేణి అవసరాలతో కస్టమర్‌లకు అందించే ఆకర్షణీయమైన ధరల పాయింట్‌లలో ఆరు ఆఫర్‌లతో విస్తృతమైన S1 పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ప్రీమియం కేటగిరీలోని S1 Pro ధర రూ.1,34,999 ఉండగా.. S1 ఎయిర్‌ల ధర రూ.1,07,499గా ఉంచబడింది. మాస్ మార్కెట్ ఆఫర్‌లలో S1 X పోర్ట్‌ఫోలియోలోని 2 kWh ధర రూ.74,999, 3 kWh ధర రూ.87,999, 4 kWh ధర రూ.101,999గా ఉంచబడ్డాయి.
ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్ తన #HyperService ప్రచారాన్ని ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ 2025 చివరి నాటికి నెట్‌వర్క్‌ను 10,000కి పెంచాలని నిర్ణయించింది. దీని కోసం దేశంలోని ప్రతి మెకానిక్‌ను EV-సిద్ధంగా చేయడానికి లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణను కూడా అందిస్తోంది. అలాగే ఆగస్టు 2024లో జరిగిన వార్షిక 'సంకల్ప్' ఈవెంట్‌లో, రోడ్‌స్టర్ X (2.5 kWh, 3.5 kWh, 4.5 kWh), రోడ్‌స్టర్ (3.5 kWh, 4.5 kWh, 6 kWh), రోడ్‌స్టర్‌లతో కూడిన రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications