Olectra Greentech: దూసుకుపోతున్న తెలంగాణ ఈవీ బస్ కంపెనీ.. భారీగా పెరిగిన లాభాలు..
Olectra Greentech: ప్రస్తుతం పెరుగుతున్న శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రానున్న కొన్నేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బస్సులు, ట్రక్కులకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్ద ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సెప్టెంబర్30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ కాలంలో ఒలెక్ట్రా 154 ఎలక్ట్రిక్ వాహానాలను సరఫరా చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 111 వాహానాలను ఉత్పత్తి చేసింది. విద్యుత్ వాహానాల సరఫరాలో పెరుగదలతో ఈ ఆర్దిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 73 శాతం పెరిగి రూ.3,076 కోట్లుగా నమోదైంది.

కంపెనీ ఇప్పటి వరకు 1,437 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఇంకా కంపెనీ చేతిలో 8208 బస్సులకు సరఫరాకు సంబందించిన ఆర్డర్ ఉంది. వడ్డీ, పన్నులు,రుణం,తదితరాల చెల్లింపుల అనంతరం కంపెనీ ఆదాయం రూ.45.06 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఇది 72 శాతం అధికం.
బస్సుల సరఫరాలో పెరుగుదల వల్ల ఈ ఆర్దిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.523.18 కోట్లు అంటే 14 శాతం పెరిగింది. ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఎండీ కెవి ప్రదీప్ మాట్లాడుతూ తమ నికర ఆదాయంలో గణనీయమైన పురోగతి ఉందని చెప్పారు. తమ ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంచుకోవడంతో పాటు, అధునాతన సాంకేతికత వినియోగంపై దృష్టిసారించామని వెల్లడించారు. తమకు భారీ సంఖ్యలో ఆర్డర్లు ఉన్నాయని చెప్పారు. వికారాబాద్ జల్లా సీతారాంపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో ఒలెక్ట్రా ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,ఈ ప్లాంట్ పూర్తైన అనంతరం ఉత్పాదక సామర్ద్యం గణనీయంగా పెరుగుతుందని ప్రదీప్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications