Bernard Arnauld: యూరప్‌కు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ గూడ్స్ గ్రూప్ LVMH మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 బిలియన్ డాలర్లను చేరుకుంది. దీంతో కంపెనీ ప్రపంచంలోనే టాప్-10 అతిపెద్ద కంపెనీల జాబితాలో ప్రవేశించిన కొద్ది రోజులకే రికార్డులు సృష్టిస్తోంది.
ఈ నెలలో దాని షేర్లు దాదాపు 7 శాతం మేర లాభపడతంతో మార్కెట్ క్యాప్ పెరిగి కంపెనీ తాజా రికార్డును సృష్టించింది. మెుదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలతో రికార్డు సాధించిన యూరోపియన్ కంపెనీగా నిలిచింది. అయితే ఇదే క్రమంలో టెస్లా విలువ 23 శాతం పడిపోయింది. టెస్లా ధరల తగ్గింపును ప్రకటించటంతో లాభాలపై ప్రభావం చూపడంతో క్యాపిటలైజేషన్ 505 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

LVMH విలువ పెరుగుదలతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద దాదాపు 212 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. దీంతో ఎలాన్ మస్క్ తొలి స్థానాన్ని కోల్పోయారు. దీనికి ముందు భూమిపై అత్యంత ధనికుడిగా ఉన్న మస్క్ సంపద 165 బిలియన్ డాలర్లుగా ఉంది. 73 ఏళ్ల వయస్సులో ఆర్నాల్ట్ కొత్త రికార్డును సృష్టించారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం లూయిస్ విట్టన్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్డ్ తన తర్వాత పగ్గాలను వారసులకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కార్యాలంయంలో ఓ ప్రైవేటు డైనింగ్ విందుకు తన ఐదుగురు పిల్లలను పిలిచారు. 90 నిమిషాల పాటు జరిగిన భోజనం సమావేశంలో బిలియనీర్ పిల్లలను కంపెనీకి సంబంధించిన అనేక విషయాలపై ప్రశ్నించారు. అయితే దీనిలో మెరిట్ ఆధారంగా ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీ పగ్గాలు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆర్నాల్ట్ విలాసవంతమైన వస్తువులను విక్రయించే వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారో చూడటానికి వారసులను సమర్థవంతంగా ఆడిషన్ చేశారు. అయితే వారసుడిగా ఎవరిని ఎన్నుకంటాడో అనే విషయంపై ఎలాంటి సూచన చేయలేదని సమాచారం.


Click it and Unblock the Notifications