Recession News: మాంద్యంలోకి డచ్ ఆర్థిక వ్యవస్థ.. కష్టాల్లో నెదర్లాండ్స్.. యూరప్ వ్యథలు..

Netherlands Recession: అందాల యూరోపియన్ దేశం నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో జారుకుంది. ఇది రోజురోజుకీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. పూర్వం ఈ దేశాన్ని హాలెండ్ అని పిలిచేవారు.

ఐరోపా దేశం నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. యూరోజోన్‌లో నెదర్లాండ్స్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీని జీడీపీ వరుసగా రెండవ త్రైమాసికంలో క్వార్టర్లీ ప్రాతిపదికన 0.3 శాతం పడిపోయింది. సంవత్సరం మొదటి మూడు నెలల్లో 0.4 శాతం తగ్గిన తర్వాత ఇది వరుసగా రెండో త్రైమాసిక పతనంగా నమోదైంది. దీన్ని బట్టి నెదర్లాండ్స్ ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని స్పష్టమైంది.

European country

కరోనా నుంచి కోలుకున్న తరువాత నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థ 2021, 2022లో ఏడాదికి 5 శాతం చొప్పను వృద్ధిని నమోదు చేసింది. పాండమిక్ తర్వాత మొదటి మాంద్యం నెదర్లాండ్స్‌లో ఆహార ధరలు, ఇంధన బిల్లులను పెంచిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో వినియోగదారుల వ్యయం, ఎగుమతుల తగ్గుదల కారణంగా జీడీపీ క్షీణతను నమోదు చేసింది.

European country

2023 మొదటి మూడు నెలల కాలంలో నెదర్లాండ్స్‌లో వినియోగదారుల వ్యయం 1.6 శాతం పడిపోయింది. ఇదే సమయంలో ఎగుమతులు సైతం 0.7 శాతం మేర తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో నెదర్లాండ్స్‌లో ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 14.5 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత తగ్గినప్పటికీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6 శాతం వద్ద ఇంకా అధిక స్థాయిల్లోనే కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+