Europe recession: మెున్నటి దాకా అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను వణికించగా.. ఇప్పుడు ఐరోపా వల్ల ఆందోళనలు మెుదలయ్యాయి. తాజాగా యూరోపియన్ జోన్ లోని 20 దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయి.
ఐపోపా ఆర్థిక వ్యవస్థ జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దాదాపు 0.1 శాతం క్షీణించటం ఇప్పుడు ప్రపంచ దేశాలను కుదిపోస్తోంది. ఇదే సమయంలో అక్కడ ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలతో ప్రజలు తన డబ్బు ఖర్చు చేయటాన్ని తగ్గించారని తెలుస్తోంది. ఇది రానున్న కాలంలో మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా రెండో త్రైమాసికంలో ఆర్థిక తిరోగమనం ఇబ్బందులను సూచిస్తోందని వారు అంటున్నారు.

ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, పెరుగిన ఇంధన వ్యయాలు వంటి అంశాలు యూరోపియన్ దేశాలకు అతిపెద్ద సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఇవి వారి ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూరోపియన్ దేశాల మాంద్యం ప్రభావం భారత్ పై కూడా ఉండటం. యూరో జోన్‌లో డిమాండ్ తగ్గితే దేశ ఎగుమతులు కూడా తగ్గుతాయి. దీని ప్రభావం ఉపాధి కల్పనపై కూడా కనిపిస్తుంది.
యూరోపియన్ మాంద్యం వల్ల దేశంలోని కాన్పూర్ లెదర్ ఉత్పత్తులకు డిమాండ్ రెండు నెలలుగా దాదాపు 25 శాతం పడిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7,000 కోట్ల విలువైన లెదర్ ఎగుమతులు జరిగాయి. ఇదే క్రమంలో ఇంజనీరింగ్, ప్లాస్టిక్, టెక్స్‌టైల్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు సైతం 20 శాతం మేర క్షీణించాయి. అలాగే మీరట్ నుంచి ఎగుమతయ్యే చేనేత, హస్తకళ మరియు క్రీడా వస్తువుల ఎగుమతులు 25-30 శాతం మేర ప్రభావితమయ్యాయి.
అలాగే సహరాన్ పూర్ చెక్క బొమ్మల వ్యాపారం 25 శాతం, మెురాబాద్ హస్తకళల వ్యాపారం 30 శాతం, ఆగ్రా రాతి హస్తకళల వ్యాపారం 30 శాతం, జార్ఖండ్ నుంచి జరిగే వస్త్ర పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతి 5-8 శాతం మేర ప్రభావితం అయ్యాయి. వీటన్నింటితో పాటు ప్రధానంగా భారత ఐటీ పరిశ్రమ ఎక్కువ శాతం తన ఎగుమతులను యూరోపియన్ మార్కెట్లకు అందిస్తుంది. ఐటీ ఎగుమతుల్లో 90 శాతం అమెరికా, యూరప్ దేశాలకు ఉన్నందున ఇప్పుడు అక్కడి ఆర్థిక వ్యవస్థలు దిగజారటం ఇక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గడ్డు కాలం ఎదుర్కొంటున్న టెక్కీలు రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications