గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌తో పోలిస్తే నేడు 4 శాతం పెరిగి 2.63 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. క్రితం సెషన్‌తో పోలిస్తే బిట్ కాయిన్ 1 శాతం పెరిగి 64,558 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం సెషన్‌లలో బిట్ కాయిన్ 11 శాతం పెరిగింది. ఎథేరియం 4000 డాలర్లు క్రాస్ చేసింది. ఈ సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో నేడు 8 శాతం లాభపడింది. వారం రోజుల్లో ఈ స్టాక్ 14 శాతం లాభపడింది. కార్డానో 7 శాతం లాభపడగా, సోలానా 16 శాతం పెరిగింది. కార్డానో 2.24 డాలర్లు, సోలానా 182.11 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్, పోల్కాడాట్ వరుసగా 3 శాతం, 6 శాతం చొప్పున ఎగిశాయి.
ప్రస్తుతం బిట్ కాయిన్ 64వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసి మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది. నిన్న 66వేల డాలర్లను దాటినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది.

నేటి సెషన్‌లో బిట్ కాయిన్ 1.72 శాతం, ఎథేరియం 8.65 శాతం, బియాన్స్ కాయిన్ 2.51 శాతం, కార్డానో 6.07 శాతం, సోలానా 17.63 శాతం,
ఎక్స్‌ఆర్‌పీ 4.07 శాతం, పోల్కాడాట్ 6.38 శాతం, డోజీకాయిన్ 3.97 శాతం లాభపడ్డాయి. టెథేర్ 0.06 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications