క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా ఉంది. బిట్ కాయిన్ నేడు 54,300 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలో రూ.40 లక్షలకు పైగా పలుకుతోంది. బిట్ కాయిన్ కొద్ది రోజుల క్రితం 64వేల డాలర్లు క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత టర్కీ నిషేధం, జోబిడెన్ డబుల్ ట్యాక్స్ ప్రభావంతో ఓ సమయంలో 50వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే బిట్ కాయిన్ లిక్విడిటీకి అనుకూలమని స్పష్టం చేసేదుకు టెస్లా కొన్ని బిట్ కాయిన్స్‌ను విక్రయించింది. ఆ తర్వాత నుండి బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 54వేల డాలర్లు దాటింది.

బిట్ కాయిన్ కంటే ఎథేరియం అదుర్స్ కానీ
ప్రపంచంలో బిట్ కాయిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న క్రిప్టో కరెన్సీ ఎథేరియం. ఈ క్రిప్టో ఇప్పుడు 2,799.61 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అంతకుముందు సెషన్‌లో ఎథేరియం 1.4 శాతం లాభపడి 2,706.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తాజాగా ఏప్రిల్ 29వ తేదీ సెషన్‌లో 2800 సమీపానికి చేరుకుంది.
గత ఏడాది కాలంలో ఎథేరియం ధర 260 శాతం ఎగిసింది. అదే సమయంలో బిట్ కాయిన్ 87 శాతం పెరిగింది. అంటే బిట్ కాయిన్ కంటే ఎథేరియం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అయినప్పటికీ బిట్ కాయిన్ వ్యాల్యూకు ఎథేరియం చాలా దూరంలో ఉంది. బిట్ కాయిన్ 54వేల డాలర్లు దాటగా, ఎథేరియం 2800 డాలర్ల వద్ద ఉంది.

అందుకే ఎథేరియం ర్యాలీ
ఎథేరియం బ్లాక్ చైన్ ద్వారా 100 మిలియన్ యూరోలను జారీ చేసినట్లు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు తెలిపింది. దీంతో ఎథేరియం అంతకంతకూ ఎగిసింది. అంతేకాకుండా మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్, యూబీఎస్ వంటి ప్రధాన స్రవంతి ఆర్థిక సంస్థలు కూడా ఈ డిజిటల్ కరెన్సీ ట్రాక్షన్ పొందుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎథేరియం ర్యాలీ చేసింది. అమెజాన్ వెబ్ సిరీస్, మక్రోసాఫ్ట్ అజూర్ ఎథేరియం ప్లాట్ ఫాంను వినియోగిస్తున్నాయి.

ఎథేరియం ఫౌండర్స్
ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియం. ఇది 2015లో లాంచ్ అయింది. ఇది కేవలం క్రిప్టోకరెన్సీ మాత్రమే కాదు. డీసెంట్రలైజ్డ్ యాప్ స్టోర్ కూడా. ఈ క్రిప్టోను ఎనిమిది మంది కలిసి తీసుకు వచ్చారు. ప్రస్తుతం రష్యన్-కెనడియన్ ఎంటర్‌ప్రెన్యూర్ విటాలిక్ బుటేరిన్ ఈ బ్లాక్ చైన్ ప్లాట్ ఫామ్ పైన యాక్టివ్‌గా ఉన్నారు. మరో ఆరుగురు.. మిహాయి అలీసీ, ఆంథోనీ ది లోరియో, అమీర్ చెట్రిట్, చార్లెస్ హోస్కిన్సన్, గేవిన్ వుడ్, జెఫ్రే విల్కే ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications