ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేర్(ఎథేరియం) భారీగా ఎగిసిపడింది. ఈ క్రిప్టో తొలిసారి 2,000 డాలర్లను తాకింది. ఇటీవల బిట్ కాయిన్, ఎథేర్ వంటి క్రిప్టోలు అంతకంతకూ పెరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ఎథేరియమ్ 2.3 శాతం ఎగబాకి 2,014 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 2021 సంవత్సరంలో ఇది 170 శాతం వృద్ధిని నమోదు చేసింది. బ్లూమ్‌బర్గ్ గెలాక్సీ క్రిప్టో ఇండెక్స్ 3 శాతం పెరగగా, బిట్ కాయిన్ ఈ ఏడాది దాదాపు రెండింతలు అయింది.
పోటీ క్రిప్టో బిట్‌కాయిన్‌కు ధీటుగా ఎథేరియం వృద్ధిని నమోదు చేస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వివిధ దేశాలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను పెట్టుబడుల వైపు మళ్లించి, బిట్ కాయిన్, ఎథేరియంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.

బిట్ కాయిన్ కంపెనీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ భారత్‌లో కార్యకలపాల కోసం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయివేటు క్రిప్టోకరెన్సీలను కేంద్రం నిషేధిస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే అన్ని క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయలేమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అదే సమయంలో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని ఊగిసలాటల మధ్య కాయిన్‌బేస్ మన దేశంలో కార్యాలయం తెరుస్తానని ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాల కోసం పలు ఉద్యోగాల ప్రకటన చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications