ఈ20 పెట్రోల్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఎందుకంటే భారతదేశం 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వైపు అడుగులు వేస్తోంది. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 30 శాతంకి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడితే వాహనాల మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ పెట్రోల్ వినియోగంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ పెట్రోల్ వాడితే వాహనాల పనితీరులోని మైలేజీపై పెద్దగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ఈ20 వాడకం వల్ల ఇంజిన్ దెబ్బతింటుందన్న ప్రచారాలు నిరాధారమైనవని కొట్టి పారేసింది. ప్రజలు ఎలాంటి భయానికి లోనవవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏమిటి?: ఇథనాల్ బ్లెండింగ్ అనేది చెరకు, మొక్కజొన్న, మానవ ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి తీసిన పునరుత్పాదక ఇంధనమైన ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E10 పెట్రోల్ వినియోగంలో ఉండగా, దాన్ని దశలవారీగా E20 స్థాయికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇథనాల్ మిశ్రమం వాహనాలకు ముప్పు కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం.. రైతులకు దీర్ఘకాలిక లాభాలను కలిగిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

దేశం చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి నడుం బిగించనుంది. ఇతర దేశాల నుంచి భవిష్యత్తులో చమురు దిగుమతులను చేసుకోకుండా ఉండేందుకు దీనిని ఉపయోగించుకునేందుకు రెడీ అవుతోంది. కాగా కొన్ని దేశాలు ఇప్పటికే E85 (85% ఇథనాల్) వాడుతున్నాయి. దీంతో భారత్ కూడా దీనిని వినియోగం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా విదేశాల నుండి ముడిచమురు దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణ హాని తగ్గుతుంది. దేశీయ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇథనాల్‌కు శక్తి సాంద్రత (energy density) కొంత తక్కువగా ఉండటంతో, మైలేజీపై స్వల్ప ప్రభావం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది గమనించదగినంత తక్కువ అని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ తయారీదారులు మాట్లాడుతూ..ఇప్పుడే వస్తున్న వాహనాలన్నీ E10, E20 ఇంధనానికి అనుకూలంగా రూపొందించబడ్డాయని తెలిపారు. వాహన భాగాలైన రబ్బరు సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్లపై ఎలాంటి నష్టం కలగదని భరోసా ఇచ్చారు. అదే సమయంలో.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల తయారీపై పరిశ్రమలు దృష్టి పెట్టాయి. ఇవి ఎథనాల్ శాతంలో మార్పులు వచ్చినా సరే అవి సమర్ధవంతంగా నడుస్తాయి.
దీని వాడకంలోపర్యావరణం - రైతులకు మేలు జరుగుతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి హానికర వాయువుల ఉద్గారం తగ్గుతుంది. పంటల మాదిరిగా ఉత్పత్తయ్యే ఇథనాల్ కోసం చెరకు, మొక్కజొన్నలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థకి ఇది ఊతమిస్తుంది. ప్రస్తుతం E10 (10% ఇథనాల్) వినియోగంలో ఉన్నప్పటికీ.. దేశం ఇప్పుడు E20 (20% ఇథనాల్) వైపు అడుగులు వేస్తోంది.
ఇథనాల్ పెట్రోలుతో పోలిస్తే ఎక్కువగా మండుతుంది. ఇది అధిక ఆక్సిజన్ కంటెంట్ కలిగి ఉండడంతో పూర్తిగా కాలడానికి సహాయపడుతుంది. తద్వారా కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్లు (HC), పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) వంటి హానికర ఉద్గారాలు తగ్గుతాయి. ఇది పెట్రోల్‌పై ఆధారాన్ని తగ్గించడంతో పాటు, గ్రీన్ ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఇథనాల్ వాడకాన్ని మరింత విస్తరించాలంటే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంధన నిల్వలు, పంపింగ్ కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications