Best home loan rates, అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు అత్యంత కనిష్టస్థాయిలో ఉన్నాయి. ఉద్యోగి, సాధారణ వ్యక్తి, వ్యాపారస్తుడు.. ఇలా ఎవరైనా వారి జీవితంలో అతిపెద్ద కల ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు. ప్రస్తుత కాలంలో కొన్ని అవసరాలకు పర్సనల్ లోన్, వాహన కొనుగోలుకు వెహికిల్ లోన్ తీసుకుంటున్నాం. అలాంటిది భారీ బడ్జెట్‌తో కూడుకున్న ఇంటి కోసం మన వద్ద అంత పెద్ద మొత్తం ఉండదు. ఇందుకు అందరూ ఎంచుకునే ఏకైక మార్గం హోమ్ లోన్. వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కరోనాకు ముందు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8 శాతం, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ డిమాండ్ పెంచే లక్ష్యంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గివ్వడం, కేంద్రం వివిధ స్కీమ్స్ అందించడం, దీనికి తోడు రెపో రేటు తగ్గడంతో బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేటు దశాబ్దం లేదా దశాబ్దంన్నర కనిష్టానికి చేరుకుంది.

 తక్కువ వడ్డీ రేటు

తక్కువ వడ్డీ రేటు

కొన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు అత్యంత కనిష్టంగా 6.4 శాతం నుండి ప్రారంభమవుతోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ రేటు 6.4 శాతంతో కనిష్టంగా ఉంది. ఆ తర్వాత ఎస్బీఐ, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకుల్లో 6.5 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా నిర్దిష్ట రుణ గ్రహీతలకు వర్తిస్తాయి. అంటే క్రెడిట్ స్కోర్, చెల్లింపు సామర్థ్యం, వేతనం, కాలపరిమితి... వీటన్నింటిని చూసి ఇస్తారు. అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇస్తారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్కుతో అనుసంధానించబడిన రేటుతో హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ఇది ఆర్బీఐ రెపో రేటు కాబట్టి ఆర్ఎల్ఎల్ఆర్‌గా సూచిస్తారు. రెపో రేటు మారితే ఆర్ఎల్ఎల్ఆర్ పైన ప్రభావం ఉంటుంది. ఫ్లోటింగ్ హోమ్ లోన్ రేటులో, రెపో రేటు మారినప్పుడు ఈఎంఐ మారుతుంది.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కనిష్టం 6.4 శాతం, గరిష్టం 9.55 శాతం, బంధన్ బ్యాంకు కనిష్టం 6.4 శాతం, గరిష్టం 11.5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా కనిష్టం 6.5 శాతం, గరిష్టం 8.10 శాతం, ఇండియన్ బ్యాంకు కనిష్టం 6.5 శాతం, గరిష్టం 7.5 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు కనిష్టం 6.5 శాతం, గరిష్టం 7.6 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు కనిష్టం 6.55 శాతం, గరిష్టం 7.20 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిష్టం 6.60 శాతం, గరిష్టం 7.35 శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంకు కనిష్టం 6.60 శాతం, గరిష్టం 8.90 శాతం, ఎస్బీఐ కనిష్టం 6.70 శాతం, గరిష్టం 6.90 శాతం, HDFC బ్యాంకు కనిష్టం 6.70 శాతం, గరిష్టం 7.65 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు కనిష్టం 6.70 శాతం, గరిష్టం 7.55 శాతం, ఐడీబీఐ బ్యాంకు కనిష్టం 6.75 శాతం, గరిష్టం 8.80 శాతం, యాక్సిస్ బ్యాంకు కనిష్టం 6.75 శాతం, గరిష్టం 7.10 శాతం ఉన్నాయి.

ఇందులో తక్కువ వడ్డీ రేటు

ఇందులో తక్కువ వడ్డీ రేటు

సచిన్ బన్సాల్‌కు చెందిన నావీ లోన్ 6.4 శాతం వడ్డీతో హోమ్ లోన్‌ను అందిస్తోంది. రూ.20 లక్షల నుండి రూ.5 కోట్ల వరకు రుణం ఇస్తుంది. రుణ కాలపరిమితి ఇరవై అయిదేళ్ల వరకు ఉంది. బెంగళూరు, మైసూర్, హుబ్లీ, దావణగెరె, గుల్బర్గా, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ లోన్ అందిస్తోంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు తగ్గుతుంది. నావీ యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా యాప్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేయాలి. పాన్ కార్డు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, మారిటల్ స్టేటస్ వంటి వివరాలు అందించాలి. ఎంప్లాయిమెంట్ వివరాలు, నెలవారీ ఆదాయం ఇవ్వాలి. పాన్ కార్డు కాపీని ఇవ్వాలి. హోమ్ లోన్ కోసం ప్రాపర్టీ, టైటిల్ డాక్యుమెంట్స్ అవసరం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+