Dunzo Layoff's: 30 శాతం ఉద్యోగులకు షాకివ్వనున్న డన్జో
నిత్యావసరాల డెలివరీ కంపెనీ అయిన డన్జో (Dunzo) మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఉద్యోగులలో 30 శాతం మందిపై తొలగింపు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉద్యోగుల తొలగింపులు కంపెనీలో ఇంజనీరింగ్ ఉద్యోగులను ప్రభావితం చేశాయని కంపెనీ చెందిన ఓ అధికారి తెలిపారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, లీడ్, కొంతమంది డైరెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిసింది. బుధవారం సంస్థ-వ్యాప్త కాల్‌లో సిబ్బందికి తొలగింపులను నోటిఫికేషన్ కూడా ఇచ్చారు.
ఖర్చులను తగ్గించుకోవడానికి, కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి లే ఆఫ్ లు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీని పోటీదారులైన Zepto, Swiggy మొదలైన కంపెనీ పోటీదారులు కూడా ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది జనవరిలో డన్జో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు 3 శాతం మంది సిబ్బందిని తొలగించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ. 464 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాల కంటే రెండు రెట్లు ఎక్కువ గా ఉంది. 2021లో కంపెనీ నష్టం రూ. 229 కోట్లుగా ఉంది.

FY 22లో స్టార్టప్ మొత్తం ఖర్చులు రూ. 531.7 కోట్లు ఉండగా నిర్వహణ ఆదాయం రూ. 54.3 కోట్లకు చేరింది. కంపెనీ ప్రకటనల ప్రచార వ్యయం ఎక్కువగా ఉంది. ఇది దాదాపు 6 రెట్లు పెరిగి రూ. 11 కోట్ల నుంచి రూ. 64.4 కోట్లకు చేరుకుంది. డన్జో కంపెనీకి గూగుల్‌తో పాటు రిలయన్స్ కూడా మద్దతు ఇస్తున్నాయి. కంపెనీలో గూగుల్ వాటా దాదాపు 20 శాతం కాగా రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications