ఈఎస్ఏఎఫ్( ESAF) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO శుక్రవారం, నవంబర్ 3న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఈ ఐపీఓ నవంబర్ 7 మంగళవారంతో ముగుస్తుంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO ప్రైస్ బ్యాండ్ ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ప్రైస్ ను రూ.57 నుంచి రూ.60 వరకు నిర్ణయించారు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాట్ పరిమాణం 250 ఈక్విటీ షేర్లుగా ఉన్నాయి. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO పబ్లిక్ ఇష్యూలో 50% కంటే ఎక్కువ షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB), నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15%, రిటైల్ పెట్టుబడిదారులకు 35% రిజర్వ్ చేసింది.
ఎంప్లాయి రిజర్వ్ పోర్షన్‌లో వేలం వేసిన అర్హులైన ఉద్యోగులకు ఒక్కో ఈక్విటీ షేర్‌కి ₹5 తగ్గింపు అందిస్తారు. నవంబర్ 2, గురువారం, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ. 135.15 కోట్లను సేకరించింది. ఒక్కో షేరుకు రూ.60 చొప్పున 2,25,24,998 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. BNP పరిబాస్ ఆర్బిట్రేజ్, కాప్తాల్ మారిషస్, ఫౌండర్స్ కలెక్టివ్ ఫండ్, ACM గ్లోబల్ VCC ఫండ్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, Edelweiss టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, SBI జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, అనంత క్యాపిటల్ వెంచర్స్, ఆల్కెమ్, VCC యాంకర్ పెట్టుబడిదారులుగా ఉన్నారు.

ESAF బ్యాంక్ IPOలో కంపెనీ రూ.390.7 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది. ముగ్గురు షేర్‌హోల్డర్‌ల ద్వారా రూ.72.3 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS) ఉంటుంది. IPO నుంచి రూ. 463 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. OFSలో ప్రమోటర్ ESAF ఫైనాన్షియల్ హోల్డింగ్స్ రూ.49.26 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తాయి. అయితే PNB మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.23.04 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి.
తాజా ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి దాని టైర్ - I క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవడానికి ఉపయోగించాలని బ్యాంక్ ప్రతిపాదిస్తోంది.ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO కోసం బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లు ICICI సెక్యూరిటీస్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్ మరియు నువామా వెల్త్ మేనేజ్‌మెంట్, లింక్ ఇన్‌టైమ్ ఇండియా IPO రిజిస్ట్రార్. తాత్కాలిక ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ తేదీ నవంబర్ 16గా ఉంది. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO కేటాయింపు తేదీ శుక్రవారం నవంబర్ 10గా నిర్ణయించారు. ఒకవేళ కంపెనీ T+3 నిబంధనలకు మారితే తేదీలు తదనుగుణంగా మారుతాయి.
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO GMP ఈరోజు లేదా గ్రే మార్కెట్ ప్రీమియం మునుపటి సెషన్ మాదిరిగానే +22. Investorgain.com ప్రకారం, శుక్రవారం గ్రే మార్కెట్‌లో ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ ధర రూ.22 ప్రీమియంతో ట్రేడ్ అవుతుందని ఇది సూచిస్తుంది. జూన్ 30, 2023 నాటికి AUM పరంగా ESAF SFB భారతదేశంలో ఐదవ అతిపెద్ద SFB. SFBలలో, ESAF FY2021-23 కాలంలో 39% వేగవంతమైన AUM CAGRని పోస్ట్ చేసింది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications