Erraya Lifespaces Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ స్టాక్స్ రంకెలు వేస్తూ తమ పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక స్టాక్ గడచిన నెల రోజులుగా నిరంతరం అప్పర్ సర్క్యూట్ తాకటం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఏం పని చేస్తుంది, ఎందుకు ఇలా పెరుగుతోంది అనే విషయాలను అన్వేషించే పనిలో పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ స్టాక్ వివరాలను పరిశీలిస్తే..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Eraaya Lifespaces Ltd కంపెనీ షేర్ల గురించే. ఈ స్టాక్ బీఎస్ఈలో లిస్ట్ అయ్యి ఉంది. గడచిన 25 ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్లు బలమైన రాబడులతో వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆగస్టు 28, 2024 నుంచి అక్టోబర్ 2, 2024 వరకు కంపెనీ షేర్ల బుల్ పరంపర కొనసాగించింది. ఈ క్రమంలో ప్రతిరోజూ కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం పెరుగుతూ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఒక నెల వ్యవధిలోనే 180 శాతం రాబడిని అందించాయి. మంగళవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్ల ధరలను పరిశీలిస్తే రూ.2767.40కి చేరుకున్నాయి. ఇది కంపెనీ షేర్లకు సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర కావటం గమనార్హం. ఇదే క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర కేవలం రూ.34.91గా ఉంది.

కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే 2024లో ఇప్పటి వరకు స్టాక్ ఏకంగా 2200 శాతం షాకింగ్ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. అలాగే గత ఏడాది కాలంలో స్టాక్ 8000 శాతం రాబడిని తన పెట్టుబడిదారులకు అందించి బెస్ట్ మల్టీబ్యాగర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.5వేల కోట్లకు పైగా ఉంది. కంపెనీకి సంబంధించి ఇటీవలి వార్తలను పరిశీలిస్తే.. Ebix ఛైర్మన్ పదవి నుంచి రాబిన్ రైనాను సస్పెండ్ చేసినట్లు అరాయా లైఫ్‌స్పేస్ సెప్టెంబర్ 30న ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
వాస్తవానికి అరాయా లైఫ్‌స్పేస్ ఇటీవలే ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇ-లెర్నింగ్‌ల కోసం ఆన్-డిమాండ్ సాఫ్ట్‌వేర్, ఇ-కామర్స్ రంగాలలో ప్రసిద్ధి చెందిన Ebix కంపెనీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త కంపెనీలో గుర్తించిన ఆర్థిక అవకతవల ఆధారంగా చైర్మన్ రాబిన్ రైనాను తప్పింస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి 2023లో జార్జియాకు చెందిన ఎబిక్స్ కంపెనీ 617 మిలియన్ డాలర్ల రుణాన్ని డిఫాల్ట్ చేసింది. ఆ తర్వాత Eraaya Lifespaces ఈ సంస్థను రూ.1,250 కోట్లకు సొంతం చేసుకుంది. తర్వాత కంపెనీ రుణాన్ని పూర్తిగా చెల్లించింది. అయితే ప్రస్తుతం కంపెనీ సీఈవోగా కరణ్ బగ్గాను నియమించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications