ఆర్థిక మాంద్యం భయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని చెబుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు నానా బాధలు పడుతున్నాయి. IT సంస్థలే కాకుండా ఇతర రంగాలకూ ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో కంపెనీ వచ్చి చేరింది. 8 వేలకు పైగా సిబ్బందిని సాగనంపనున్నట్లు ప్రకటించింది.

ఖర్చులు తగ్గించుకునేందుకే:
భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనున్నట్లు టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది సిబ్బందిని ఇంటికి పంపనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అదనంగా స్వీడన్ లోని తన శ్రామిక శక్తిలో దాదాపు 1,400 మందిని తీసివేయాలని చూస్తున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు టెక్ కంపెనీల నుంచి ఎక్కువగా వింటున్న లేఆఫ్ లు, ప్రస్తుతం టెలికాం పరిశ్రమకూ వ్యాపించినట్లు అర్థమవుతోంది.

వరుసగా నాలుగోసారి తగ్గిన ఆదాయం:
"ఆయా దేశాల్లోని స్థానిక చట్టాలను అనుసరించి ఉద్యోగుల తొలగింపు కొంత భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని సిబ్బందికి విషయం తెలిపాం" అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోల్మ్ తన మెమోలో తెలిపారు. వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ సంస్థ ఆదాయం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 5G పరికరాల అమ్మకాల్లో అధిక మార్జిన్ ఉన్న అమెరికాలోనూ సేల్స్ మందగించాయి. తద్వారా ఈ ఏడాది చివరి నాటికి 880 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గించుకోవాలని కంపెనీ చూస్తోంది. ఇందులో భాగంగానే లేఆఫ్ ల నిర్ణయం తీసుకుంది.

మార్జిన్ల తగ్గుదల ఎక్కువకాలం కొనసాగదు:
ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల సంఖ్యను కుదించడంతో పాటు కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ పొదుపు చర్యలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ గతంలో తెలిపారు. ఈ ఏడాది 6 నెలల వరకు మార్జిన్లలో తగ్గుదల ఉంటుందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాము తీసుకుంటున్న చర్యల ఫలితం రెండవ త్రైమాసికం నాటికి స్పష్టంగా తెలుస్తుందని అంచనా వేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications