Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందా..??
Stock Market: లాంగ్ ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ప్రారంభం కావటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 335 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 100 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 300 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 207 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో హీరో మోటొకార్ప్ షేర్లు నేడు 2 శాతం మేర నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మారుతీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా స్టీల్, హిందాల్కొ, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications