ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఐదో రోజు సూచీలు పతనమయ్యాయి. ఈ కాలంలో సెన్సెక్స్ 2400 పాయింట్ల మేర నష్టపోయింది. ఎనర్జీ, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు మూడు శాతం మేర నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ వ్యాల్యూ అత్యధికంగా 4.77 శాతం పడిపోయింది. అయితే మెటల్, బేసిక్ మెటీరియల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడి మరింత నష్టపోయింది.

నిమిషానికి రూ.1000 కోట్లు ఆవిరి
నిన్న బేర్ దెబ్బతో మార్కెట్ పతనం కాగా, ఇన్వెస్టర్ల సంపద పెద్ద ఎత్తున హరించుకుపోయింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.71 లక్షల కోట్లు తగ్గింది. దీంతో రూ.200.26 లక్షల కోట్లకు పరిమితమైంది. ట్రేడింగ్ సమయంలో, ఇన్వెస్టర్లు నిమిషానికి రూ.1000 కోట్లకు పైగా సంపదను పోగొట్టుకున్నారు.

రిలయన్స్ రూ.2000 దిగువకు పతనం
సెన్సెక్స్ 30 షేర్లలో 27 నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ అత్యధికంగా 4.77 శాతం నష్టపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ 4.51 శాతం వరకు పతనమయ్యాయి. చాన్నాళ్లకు ఇటీవలే రూ.2000 దాటిన రిలయన్స్ షేర్ నిన్న బేర్ దెబ్బతో మరోసారి రూ.2000 దిగువన ముగిసింది.

రోజంతా నష్టాల్లోనే
నిన్న సెన్సెక్స్ ఉదయం 50,910 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాసేపటికి నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోను కోలుకోలేదు. లాభాల్లోకి వచ్చినట్లు ఒకటిరెండుసార్లు కనిపించినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో ఎప్పటికప్పుడు పతనమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఓ దశలో 49,617.37 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్, చివరకు 1145.44 పాయింట్ల నష్టంతో 49,744.32 వద్ద ముగిసింది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications