రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బుధవారం ద్రవ్య పరపతి విధాన సమావేశానికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా రెపో రేటును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ విధాన ప్రకటనకు ముందు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం పేలవంగా ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ కదలికలు సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు మరోసారి పెంచుతుందనేందుకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఈసారి కూడా 40 నుండి 50 బేసిస్ పాయింట్ల మేరకు పెరగవచ్చునని అంచనా.
ఐటీ, రియాల్టీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కౌంటర్స్‌లో అమ్మకాల ఒత్తిడి, మెటల్ స్టాక్స్ కొంత కొనుగోళ్లను చూసినప్పటికీ హెడ్ లైన్ ఇండెక్స్‌ను దిగువకు లాగాయి. బుధవారం ఆర్బీఐ రెపో రేటును 40 నుండి 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే ఊహాగానాలతో పాటు మే నెలలో అమెరికా ఉద్యోగాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ జత కలిశాయి. దీంతో ఫెడ్ వడ్డీ రేటు దూకుడు పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ క్రూడ్ ధరలలో భారీ పెరుగుదల మార్కెట్ పైన ప్రభావం చూపింది. క్రూడ్ ధరల పెరుగుదల కారణంగా అధిక ద్రవ్యోల్భణం ఉండవచ్చుననే ఆందోళనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు సూచీలు కాస్త క్షీణించాయి. సెన్సెక్స్ ఉదయం భారీ నష్టాల్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత కోలుకొని, లాభాల్లోకి వచ్చాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. అయితే ఇది స్వల్పమే. సెన్సెక్స్ 94 పాయింట్లు క్షీణించి 55,675 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 16,569 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు 11 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా, 7 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ వద్ద పరీక్షను ఎదుర్కొన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications