eps pension: బడ్జెట్‌కు ముందే శుభవార్త! EPS పెన్షన్లు భారీగా పెంపు! ఎంతంటే..
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఇది నిజంగా తీపి కబురు! త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కు ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. EPS పెన్షన్ల(eps pension)ను భారీగా పెంచనుంది. దీని గురించిపూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను విడుదల చేయనుంది. అయితే దీనికంటే ముందే పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-1995) కింద ఉన్న కనీస నెలవారీ పెన్షన్ ను రూ.1,000 నుంచి ఏకంగా రూ.9,000కి పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పెంపు గనుక ఆమోదం పొందితే.. ఇది ఏకంగా 800% పెరుగుదల అవుతుంది. లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఇది భారీ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది.
EPS 1995 అంటే ఏంటి?
EPS 1995 అనేది కేంద్రం అమలు చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ పథకం. ఈ పెన్షన్ ఫండ్ ను ఉద్యోగి కంపెనీ (Employer) ద్వారా అలాగే ప్రభుత్వ బడ్జెట్ ద్వారా సమకూరుస్తారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ రూ.1,000 ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ అని పెన్షనర్లలో అభిప్రాయం ఉంది.
ఎందుకు పెంచుతున్నారు?
పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పెన్షనర్లకు రూ.1000 ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో దీన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్ల నుంచి డిమాండ్ లు రావడంతో ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశాలు (Pre-Budget Talks)లో.. వివిధ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ ముఖ్యమైన డిమాండ్ ను బలంగా వినిపించారు. అంతేకాకుండా.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉండటానికి రూ.9,000కి పెంచిన పెన్షన్ ను డియర్‌నెస్ అలవెన్స్ (DA) తో కూడా అనుసంధానం చేయాలని వారు ప్రతిపాదించారు. అంటే ద్రవ్యోల్బణం పెరిగితే పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
రూ.9,000 పెరిగితే ప్రయోజనం ఎంత?
ప్రస్తుతం రూ.1,000 తీసుకుంటున్న పెన్షనర్లకు ఇది ఒక వరం లాంటిది. సుమారు 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఈ పెంపుతో నేరుగా ప్రయోజనం పొందుతారు. పెన్షన్(eps pension) రూ.9,000కి పెరిగితే వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, నిత్యావసరాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి గణనీయమైన ఆర్థిక చేయూత లభిస్తుంది.
నిర్ణయం కోసం వెయిటింగ్..
మొత్తానికి.. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నా.. దీనికి సంబంధించిన తుది ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. రాబోయే బడ్జెట్ లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయంపై పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్ త్వరలో రానున్నాయి.


Click it and Unblock the Notifications