For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్‌కు రావొద్దు, అన్నీ అక్కడే!: ఈపీఎఫ్ఓ సూచన, ఉద్యోగులు సగం మంది ఇంటి నుండే

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. ఎవరు కూడా కార్యాలయాలకు రావొద్దని సూచించింది. ఏ అవసరం ఉన్నా దానిని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తి నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

EPFO interest rate: ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటుకు మార్కెట్ల షాక్!EPFO interest rate: ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటుకు మార్కెట్ల షాక్!

ఇంటి నుండే.. EPFO సూచన

ఇంటి నుండే.. EPFO సూచన

పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు, పీఎఫ్ అమౌంట్ తీసుకోవడం, పీఎఫ్ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవడం, చెల్లింపులు చేయడం వంటి వివిధ అవసరాలకు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. వివిధ రకాల చాలా సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తమ తమ అవసరాల నిమిత్తం పీఎఫ్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయానికి రాకుండా ఇంటి నుండే చేసుకోవాలని కోరింది.

ఇవన్నీ ఆన్ లైన్ ద్వారా..

ఇవన్నీ ఆన్ లైన్ ద్వారా..

యూఏఎన్ జనరేటింగ్, పాస్ బుక్ ద్వారా బ్యాలెన్స్ చూసుకోవడం, డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ను అప్ డేట్ చేసుకోవడం, ఖాతా బదలాయింపు, ఆన్‌లైన్ ద్వారా క్లెయిమ్స్, పెన్షన్ లేదా ఇన్సురెన్స్ బెనిఫిట్స్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్, యూఏఎన్ నెంబరప్ లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్‌తో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తెలుసుకోవడం, పాస్‌బుక్ చూసుకోవడం ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

సగం మంది మాత్రమే ఆఫీస్‌కు..

సగం మంది మాత్రమే ఆఫీస్‌కు..

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంటి నుండి పని చేయాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగులను ఆదేశించింది. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల్లో సగం మందిని ఇంటి నుంచే పని చేయాలంచాలని ఆదేశించింది. ప్రతి రోజు సగం మందికి మించి ఆఫీస్‌కు రావొద్దని సూచించింది.

English summary

ఆఫీస్‌కు రావొద్దు, అన్నీ అక్కడే!: ఈపీఎఫ్ఓ సూచన, ఉద్యోగులు సగం మంది ఇంటి నుండే | EPFO urges its subscribers to avail various services online

Retirement fund body the Employees Provident Fund Organisation has urged its subscribers, including members, pensioners and employers, to avail various online services to avoid visiting EPFO offices to prevent the community spread of Corona virus.
Story first published: Sunday, March 22, 2020, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X