EPFO News: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. చందాదారులకు సేవలు మెరుగు పరచేందుకు..
Provident Fund: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై EPFO ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతకంతకూ పెరుగుతూ పోతున్న చందాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా నిబంధనలకు మార్పులు చేసింది. కాగా ఇప్పుడు క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌కు సంబంధించి మెంబర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
PF క్లెయిమ్స్ సెటిల్మెంట్‌ను మరింత తేలికగా మార్చేందుకు EPFO చర్యలు చేపట్టింది. రానున్ను త్రైమాసికంలో దాని అప్‌డేటెడ్ EPFO IT సిస్టం 2.01 ప్రారంభించనుంది. ఖాతాదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా యజమానులకు కూడా పలు సులభతర సౌకర్యాలు దీనిద్వారా లభిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా క్లెయిమ్స్ సత్వర పరిష్కారం కోసం క్రమబద్ధీకరించిన కేంద్రీకృత వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ను ఉద్యోగులు మాన్యువల్‌గా నిర్వహించేవారు. కాగా దాన్ని ఇప్పుడు ఆటోమేట్ చేయాలని EPFO చూస్తోంది. ఇందుకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ప్రామాణికంగా తీసుకోనుంది. ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ సెంట్రలైజ్ అయి ప్రతినెలా జరిగిపోతుంటాయి. ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే సమయంలో మెంబర్ ట్రాన్స్‌ఫర్ వంటి అవసరం లేకుండా చాలా సులభంగా వ్యవహారం పూర్తవుతుంది.
కేవలం వీటితోనే సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్ దీనికి జోడిస్తామని అని EPFO ప్రకటించింది. ప్రదాని మోదీ సారథ్యంలో కార్మిక శాఖ మరియు EPFOలు ఉద్యోగుల అభ్యున్నతి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ బెనిఫిట్స్ కల్పించే దిశగా ఈ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వీటికి తోడు అతి త్వరలో EPFOలో బేసిక్ ఎక్సెప్షన్ లిమిట్ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications