దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించుకునే ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేయాలనే లక్ష్యంతో యూపీఐ (Unified Payments Interface) ఆధారిత విత్‌డ్రా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త విధానం 2026 ఏప్రిల్ నాటికి అమల్లోకి రానుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్ ఫారమ్‌లు సమర్పించడం, ఆధార్-బ్యాంకు లింకింగ్, ధృవీకరణ వంటి అనేక దశలను పూర్తి చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియకు సాధారణంగా కొన్ని రోజులు, కొన్ని సందర్భాల్లో వారాలు కూడా పడుతోంది. అయితే యూపీఐ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వస్తే ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభంగా మారనుంది. సభ్యులు తమ పీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్ ఉపయోగించి నేరుగా డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈపీఎఫ్‌వో ప్రస్తుతం తన ఐటీ మౌలిక సదుపాయాల్లో కీలక మార్పులు చేస్తోంది. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, భద్రతా ప్రమాణాల అమలు, బ్యాంకులు-యూపీఐ నెట్‌వర్క్‌తో సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఈపీఎఫ్‌వో ఆటో-సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి సభ్యులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాల కోసం చేసే పాక్షిక ఉపసంహరణ క్లెయిమ్‌లను మూడురోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. ఈ విధానంలో గరిష్ట పరిమితిని గతంలో ఉన్న రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా సభ్యులకు మరింత ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు.
అలాగే.. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా ఈపీఎఫ్‌వో సరళీకరించింది. గతంలో ఉన్న 13 సంక్లిష్ట నియమాలను తొలగించి, వాటిని మూడు సులభమైన కేటగిరీలుగా విభజించింది. దీని వల్ల సభ్యులు తాము అర్హత కలిగిన మొత్తాన్ని సులభంగా అర్థం చేసుకుని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది.
కొత్త నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ EPFO ఖాతాలో ఉన్న అర్హత బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత దృష్ట్యా కనీసం 25 శాతం మొత్తాన్ని ఖాతాలో కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పీఎఫ్ ఖాతాపై ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుండటంతో పాటు చక్రవడ్డీ ప్రయోజనాలు కూడా అందుతాయి. యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్‌వో సేవలు బ్యాంకింగ్ స్థాయికి చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే 5 కోట్లకు పైగా పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ భారం కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications