మీకు PF అకౌంట్ ఉందా? అయితే EPFO తెస్తున్న ఈ మార్పు గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్(EPFO) తమ ఏడు కోట్ల మందికి పైగా ఉన్న సబ్‌స్క్రైబర్ల కోసం ఒక భారీ పాలసీ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పీఎఫ్ అడ్వాన్స్ (పార్షియల్ విత్‌డ్రాయల్) పైసల కోసమే అందుబాటులో ఉన్న 'ఆటో-సెటిల్‌మెంట్' (Auto-settlement) సదుపాయాన్ని.. ఇకపై పూర్తి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే ఫైనల్ క్లెయిమ్స్‌కు కూడా వర్తింపజేయనున్నారు.
దీనివల్ల ఉద్యోగం మానేసినప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మాన్యువల్ చెకింగ్స్, పేపర్ ఫామ్‌లతో పనిలేకుండా డిజిటల్‌గా, చాలా వేగంగా క్లెయిమ్స్ సెటిల్ అయిపోతాయి.

EPFO to automate final PF withdrawals and account transfers check new rules for employees

ఉద్యోగం మారితే ఫామ్స్ లేకుండానే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్!

ఈ కొత్త సంస్కరణల్లో అత్యంత కీలకమైనది 'సీమ్‌లెస్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్'. సాధారణంగా ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ డబ్బులను బదిలీ చేయడానికి ఉద్యోగులు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఫామ్‌లు సబ్మిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవస్థలు ఉండవు. మీరు కొత్త ఉద్యోగంలో చేరగానే, పాత అకౌంట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా మీ లేటెస్ట్ ఎంప్లాయర్ ఖాతాలోకి మైగ్రేట్ అయిపోతుంది.

కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఫైనల్ విత్‌డ్రాయల్స్‌తో పాటు, ఈ ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు EPFO శరవేగంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మూడు రోజుల్లోనే క్లెయిమ్స్ క్లియర్!

ప్రస్తుతం EPFO అమలు చేస్తున్న ఆటో-సెటిల్‌మెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 70 శాతం అడ్వాన్స్ క్లెయిమ్స్ (రూ. 5 లక్షల వరకు) కేవలం మూడు రోజుల్లోనే క్లియర్ అవుతున్నాయి. ఈ సక్సెస్ రేట్‌ను చూశాకే, ఫైనల్ విత్‌డ్రాయల్స్‌కు కూడా దీనిని విస్తరించాలని నిర్ణయించారు. ఈ సంస్కరణలన్నీ త్వరలో రాబోయే కొత్త లేబర్ కోడ్స్ (Labour Codes) , సవరించిన ఈపీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ స్కీమ్‌ల నియమ నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి.

లాభం ఎవరికి?

ఈ సరికొత్త ఆటోమేషన్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్లకు పైగా పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు సమయం వృథా కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు చేతికి అందుతాయి.
పారదర్శకతను పెంచడం, కస్టమర్ సర్వీస్‌ను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా EPFO ఈ అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సిస్టమ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే తలనొప్పులు శాశ్వతంగా తప్పినట్లే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+