EPFO New Rules: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఎప్పటికప్పుడు నియమనిబంధనల్లో సవరళలను చేస్తుంటుంది. అయితే తాజాగా చేసిన మార్పులు చాలా మంది చందాదారులను నిరాశకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన కొవిడ్-19 అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రారంభంలో చందాదారులు అడ్వాన్స్ రూపంలో తమ నిధి నుంచి సొమ్మును ఉపసంహరించుకోవటానికి ఈ స్కీమ్ తీసుకురాబడింది. అనారోగ్యానికి గురై చికిత్స పొందటానికి సపోర్ట్ కోసం 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఇది ప్రవేశపెట్టబడింది.

ఈపీఎఫ్ఓ తాజా సవరణ కారణంగా ఇకపై ఉద్యోగులు కోవిడ్-19 కోసం ముందస్తు చెల్లింపును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది మినహాయింపు పొందిన ట్రస్ట్‌లకు కూడా వర్తిస్తుందని భవిష్యనిధి సంస్థ స్పష్టం చేసింది. COVID-19 పథకం అర్హతగల వ్యక్తులు "మూడు నెలలపాటు ప్రాథమిక వేతనాలు, డియర్‌నెస్ అలవెన్స్‌ల మేరకు లేదా EPF ఖాతాలో మీ క్రెడిట్‌లో ఉన్న మొత్తంలో 75% వరకు డబ్బు వీటిలో ఏది తక్కువైతే అది విత్ డ్రా చేసుకునేందుకు స్కీమ్ అనుమతిని గతంలో అందించింది.
EPF సబ్‌స్క్రైబర్‌లు ఇతర షరతుల్లో అడ్వాన్స్‌ను పొందవచ్చు. వారి యూనివర్సల్ ఖాతా నంబర్ యాక్టివేట్ చేయబడినంత వరకు, UANకి లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ఫంక్షనల్‌గా ఉన్నంత వరకు. ఇంతలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి శుక్రవారం సూచించిన సర్య్కులర్ ప్రకారం.. EPFO త్వరలో ప్రతి సభ్యునికి UAN-ఆధారిత సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్‌ను, క్లెయిమ్‌ల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి దాని అప్లికేషన్‌ను పునరుద్ధరించనుంది. దిల్లీలో EPFO సంస్కరణలపై జరిగిన సమీక్షా సమావేశానికి కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా అధ్యక్షత వహించిన వెంటనే నిర్ణయం వెలువడింది.
అనారోగ్యం, విద్య, వివాహం, గృహాల కోసం EPFO ఇప్పటికే రూ.లక్ష వరకు అడ్వాన్స్‌ల ఆటో సెటిల్‌మెంట్‌ను అమలును తాజాగా ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఆటో మోడ్‌లో సుమారు 25 లక్షల అడ్వాన్స్ క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. ఇది క్లెయిమ్ సెటిల్‌మెంట్ స్పీడ్‌ని పెంచింది. ప్రస్తుతం అధికశాతం క్లెయిమ్స్ మూడు రోజుల్లోనే సెటిల్ అవుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications