EPFO Latest News: దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని భారత ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పథకాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతినెల ఉద్యోగితో పాటు యజమాని కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం చాలా కంపెనీల్లో రెండు పీఎఫ్ మెుత్తాలను కేవలం ఉద్యోగి చెల్లిస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ క్రమంలోనే ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకురావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం ఆర్థిక భారం లేదా మరేదైనా కారణాల వల్ల ఈపీఎఫ్ఓతో రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయలేకపోయిన లేదా ఈపీఎఫ్ఓ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోలేకపోయిన కంపెనీలు/సంస్థలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అంటే సదరు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం ఇది తిరిగి పీఎఫ్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషిగా చెప్పుకోవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు స్కీమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమింగ్ జరగుతోంది. దీని ప్రకటన డిసెంబరు చివరి నాటికి ఉండవచ్చని సమాచారం.

ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‍లో ఈ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా ఒక భాగంగా ఉంటుందని సంబంధిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో ఉపాధిని ప్రోత్సహించడానికి, సంఘటిత రంగంతో కార్మికులను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ELI స్కీమ్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ అయిన ఉద్యోగులకు రూ.15,000 అంటే మూడు వాయిదాల్లో ఒక నెల జీతం ఇవ్వబడుతుంది. ఈఎల్ఐ స్కీమ్ కింద ఉత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈపీఎఫ్‌వో సహకారానికి సంబంధించిన ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీంతో పాటు రూ.లక్ష కంటే తక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు యాజమాన్యాలు ప్రతి నెలా రూ.3,000 రీయింబర్స్‌మెంట్‌ను రెండేళ్లపాటు అందించబడుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఈఎల్ఐ స్కీమ్ ద్వారా EPFOలో నమోదు చేసుకున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తోడు ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకే ఆమ్నెస్టీ స్కీమ్ మరో ప్రోత్సహాకంగా పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. స్కీమ్ కింద 2017-2024 మధ్య కాలంలో EPFOలో తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయలేకపోయిన లేదా రిజిస్ట్రేషన్ తర్వాత సకాలంలో నెలవారీ చందాలను జమ చేయలేని యజమానులందరికీ ఉపశమనం అందించబడుతుంది. తద్వారా వారు తమ పాత ఖాతాను తిరిగి యాక్టివ్ చేసుకునేందుకు అవకాశం దొరుకుంది.
ఈపీఎఫ్ఓ నమోదు ఎవరికి తప్పనిసరి..?
నిబంధనలను పరిశీలిస్తే.. ఏదైనా కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగుల సంఖ్య 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లయితే.. సదరు యజమాని ఉద్యోగులకు పీఎఫ్ బెనిఫిట్స్ అందించటానికి EPFOలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికీ EPFOలో రిజిస్టర్ కాకపోవడం లేదా సకాలంలో కంట్రిబ్యూషన్‌ను జమ చేయలేకపోవడం వల్ల ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications