ఎక్కువ పెన్షన్ పొందేందుకు మార్గం.. EPFO అవకాశం.. పూర్తి వివరాలు
EPFO News: ఉద్యోగులు ఈపీఎఫ్ కింద అధిక పెన్షన్ పొందేందుకు EPFO మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులైన వ్యక్తులు దీనికోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అధిక పెన్షన్ పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు మార్చి 3, 2023తో ముగుస్తుందని ప్రకటించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉద్యోగులు తమ ప్రాంతీయ కార్యాలయంలో తమ ఎంపికలను సమర్పించవచ్చు.
పెన్షన్ కాంట్రిబ్యూషన్..
సుప్రీంకోర్టు ఇచ్చిన 4 నెలల గడువుకు 15 రోజుల ముందు ఉద్యోగులకు అధిక పెన్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ, వేతన పరిమితి కంటే ఎక్కువ వేతనాలపై పెన్షన్ కాంట్రిబ్యూషన్‌లను ఎంచుకోని ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1, 2014న లేదా అంతకు ముందు EPS సబ్‌స్క్రయిబ్‌ను కొనసాగించిన ఉద్యోగులకు ఆన్‌లైన్ సౌకర్యం అందించబడుతుంది.

సుప్రీం కోర్టు తీర్పు..
EPFO ఇంతకుముందు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్‌ను ఎంచుకోలేని అర్హతగల ఉద్యోగుల కోసం ఒక విండోను తెరిచింది. సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022 నాటి తీర్పులో ఇంతకు ముందు అవకాశాన్ని కోల్పోయిన సభ్యులకు ఎక్కువ పెన్షన్‌ను ఎంచుకోవడానికి వన్-టైమ్ ఆప్షన్‌ను అందించిన తర్వాత అధిక పెన్షన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఈపీఎస్ కింద అధిక పెన్షన్‌ను ఎంపిక చేసుకునేందుకు అర్హులైన ఉద్యోగులు తీర్పు వెలువడిన తేదీ నుంచి నాలుగు నెలల గడువును సుప్రీంకోర్టు విధించినందున దరఖాస్తుకు చివరి గడువు మార్చి 3, 2023తో ముగియనుంది.


Click it and Unblock the Notifications