EPFO లో నామినీ పేరు మార్చారా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ కుటుంబానికి రూపాయి కూడా రాదు!
సాలరీ వచ్చే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ (EPF) అనేది ఒక పెద్ద ఆస్తి లాంటిది. రిటైర్మెంట్ అయ్యాక లేదా అత్యవసర సమయాల్లో ఈ డబ్బులే మనకు అండగా నిలుస్తాయి. అయితే చాలా మంది పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. అదేంటో తెలుసా? నామినేషన్ (Nomination).
ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పీఎఫ్ డబ్బులు, పెన్షన్, అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నీ కుటుంబ సభ్యులకు అందాలంటే నామినీ పేరు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు EPFO ఈ ప్రాసెస్‌ను పూర్తిగా ఆన్‌లైన్ చేసింది. కానీ చాలా మంది కేవలం పోర్టల్‌లోకి వెళ్లి నామినీ వివరాలు ఎంటర్ చేసి వదిలేస్తున్నారు. అలా వదిలేస్తే మీ నామినేషన్ అసలు పూర్తి కానట్లే! అది వాలిడ్ అవ్వాలంటే ఆధార్ ఆధారిత 'ఈ-సైన్' (e-Sign) చేయడం తప్పనిసరి. అసలు ఆన్‌లైన్‌లో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చాలా సింపుల్‌గా, స్టెప్స్ రూపంలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభించే ముందు ఇవి చెక్ చేసుకోండి..
• మీ UAN నంబర్ యాక్టివేట్ అయి ఉండాలి.
• UAN నంబర్‌కు ఆధార్ లింక్ అయి ఉండాలి.
• ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి (ఎందుకంటే ఓటీపీ దానికే వస్తుంది).
• EPFO రికార్డుల్లో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ.. ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో మ్యాచ్ అవ్వాలి.
నామినేషన్ అప్‌డేట్ చేసే సింపుల్ స్టెప్స్
1.పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి:స్టెప్ 1.
మొదట EPFO మెంబర్ ఈ-సేవా పోర్టల్‌కు వెళ్లండి. మీ UAN, పాస్‌వర్డ్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
2.ఈ-నామినేషన్ ఆప్షన్ ఎంచుకోండి:స్టెప్ 2.
లాగిన్ అయ్యాక, పై భాగంలో మెనూ బార్‌లో ఉన్న 'Manage' పై క్లిక్ చేసి, అందులో 'E-Nomination' అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
3.ప్రొఫైల్ వివరాలు వెరిఫై చేయండి:స్టెప్ 3.
ఇప్పుడు స్క్రీన్ పై మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ వివరాలు కనిపిస్తాయి. అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని 'Proceed' పై క్లిక్ చేయండి.
4.ఫ్యామిలీ డిక్లరేషన్ ఇవ్వండి:స్టెప్ 4.
తదుపరి స్క్రీన్‌లో మీకు కుటుంబం ఉందా? (Having Family?) అని అడుగుతుంది. అక్కడ 'Yes' అని సెలెక్ట్ చేయండి. దీనివల్ల భార్య, పిల్లలు లేదా ఆధారపడిన తల్లిదండ్రుల వివరాలు యాడ్ చేయడానికి వీలవుతుంది.
5.నామినీ వివరాలను ఎంటర్ చేయండి:స్టె5.
'Add Family Details' పై క్లిక్ చేసి నామినీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, మీతో ఉన్న బంధుత్వం, అడ్రస్ , ఫోటో (అడిగితే) అప్‌లోడ్ చేసి సేవ్ చేయండి. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా మీరు నామినీలుగా పెట్టవచ్చు.
6.వాటాలను కేటాయించండి (Share Allocation):స్టెప్ 6.
మీరు యాడ్ చేసిన నామినీలకు ఎంత శాతం డబ్బులు వెళ్లాలో డిసైడ్ చేయాలి. ఒకరే ఉంటే 100% అని ఇవ్వాలి. ఒకవేళ ఇద్దరు ఉంటే ఒకరికి 60%, మరొకరికి 40%.. ఇలా మీ ఇష్టం వచ్చినట్లు కేటాయించి 'Save EPF Nomination' పై క్లిక్ చేయాలి.
అసలైన , కీలకమైన స్టెప్: ఈ-సైన్ (e-Sign)
చాలా మంది పైన చెప్పిన స్టెప్స్ పూర్తి చేసి నామినేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది. వివరాలన్నీ సేవ్ చేశాక మీరు ఖచ్చితంగా ఆధార్ బేస్డ్ ఈ-సైన్ చేయాలి.
ఈ-సైన్ చేయడం ఎలా: స్క్రీన్ పై కనిపిస్తున్న 'E-Sign' ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని ఎంటర్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తేనే మీ నామినేషన్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది.
నామినేషన్ సక్సెస్ అయిందో లేదో ఎలా చూడాలి?
ఈ-సైన్ పూర్తయిన తర్వాత, మళ్లీ 'Manage' లోకి వెళ్లి 'E-Nomination' పై క్లిక్ చేయండి. అక్కడ కింద 'Nomination History' కనిపిస్తుంది. అందులో స్టేటస్ చెక్ చేస్తే "Nomination Successful" లేదా "Approved" అని గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. అలా వస్తేనే మీ నామినేషన్ రికార్డుల్లో నమోదైనట్లు లెక్క.
పెళ్లి కాకముందు పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు, లేదా పిల్లలు పుట్టిన తర్వాత నామినీ పేర్లు అప్‌డేట్ చేయాలనుకునే వాళ్లు వెంటనే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ పోర్టల్‌లో స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి!


Click it and Unblock the Notifications