EPFO SMS service: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికి ప్రోవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. అలాగే ప్రతినెల వారి జీతం నుండి కొంత PF అకౌంట్లో జమ అవుతుంది. అయితే ప్రోవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేయడంలో కూడా మీకు సమస్యలు ఎదురవుతున్నాయా.... లేదా ఒకే క్లిక్‌తో బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారా..? ఆయితే ఈ వార్త మీ కోసమే. కోట్లాది మంది EPFO యూజర్లు ఇప్పుడు PF బ్యాలెన్స్ అలాగే లేటెస్ట్ క్రెడిట్ మొత్తాన్ని కేవలం ఒక మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ పొందాలంటే ఆధార్, పాన్ లేదా బ్యాంక్ అకౌంట్ UAN అకౌంటుతో లింక్ చేసి ఉండాలి.

ఆధార్ లేదా పాన్ UAN అకౌంటుకు లింక్ చేసిన తర్వాత PF సబ్ స్క్రయిబర్లు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత మీరు చివరి EPF కంట్రీబ్యూషన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ (PF) బ్యాలెన్స్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.
ఈ ప్రాసెస్ తెలుసుకోండి: PF బ్యాలెన్స్ లేదా చివరి కంట్రీబ్యూషన్ వివరాలు వంటి EPFO సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు కొన్ని ఈజీ స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా మీ మొబైల్ నంబర్ EPFO యూనిఫైడ్ పోర్టల్‌లో మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో రిజిస్టర్ చేసి, యాక్టివేట్ చేసి ఉందొ లేదో తెలుసుకోండి.
దీని తరువాత బ్యాంక్ అకౌంట్, ఆధార్ లేదా పాన్ వంటి ఒక KYC డాక్యుమెంట్ మీ UANతో అప్ డేట్ చేసి ఉండాలి. ఈ రెండు పనులు చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగ్‌ల తర్వాత ఈ కాల్ ఆటోమేటిక్'గా డిస్‌కనెక్ట్ అవుతుంది అలాగే దీనికి ఎటువంటి కాల్ చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. కాల్ చేసిన కొద్దిసేపటికి మీ PF అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా చివరి కంట్రీబ్యూషన్ గురించి మీకు సమాచారం వస్తుంది.
SMS ద్వారా PF సమాచారం: EPFO ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా మిస్డ్ కాల్ లాంటిది. UAN యాక్టివేట్ చేసిన సబ్ స్క్రయిబర్లు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కు SMS పంపడం ద్వారా PF బ్యాలెన్స్ ఇంకా చివరి కంట్రీబ్యూషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు EPFOHO UAN అని టైప్ చేసి తరువాత మీకు నచ్చిన భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయాలి. ఉదాహరణకు మీకు తెలుగులో సమాచారం కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 SMS పంపండి.


Click it and Unblock the Notifications