అక్టోబర్‌లో 11.55 లక్షలు పెరిగిన కొత్త ఉద్యోగాలు, వీరు మళ్లీ జాయిన్ అయ్యారు..
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నుండి చాలామంది ఉద్యోగాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో గత నాలుగైదు నెలలుగా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. పేరోల్ డేటా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) డేటా ప్రకారం అక్టోబర్ నెలలో ఉద్యోగాలు పెరిగాయి.

సెప్టెంబర్‌తో తగ్గింది
అక్టోబర్ నెలలో 11.55 లక్షల మంది కొత్తగా EPFలో సభ్యులుగా నమోదు అయ్యారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 7.39 లక్షలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 56 శాతంతో మంచి వృద్ధి నమోదయింది. వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాల తీరును EPFO డేటాతో కొంత మేరకు అవగాహన చేసుకోవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలో EPFOలో 14.19 లక్షల మంది చేరికతో పోలిస్తే మాత్రం అక్టోబర్‌లో స్వల్పంగా తగ్గినట్లుగా డేటా ద్వారా వెల్లడవుతోంది.

ఈపీఎఫ్ గణాంకాల సవరణ
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,79,685 మంది సభ్యులు EPFO నుండి తగ్గిపోయినట్టు గతంలోని డేటా వెల్లడిస్తోంది. తాజాగా నవంబర్ నెలలో 1,49,248గా డేటా వెల్లడిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు EPFOలో 39.33 లక్షల మంది కొత్త సభ్యులుగా చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానాలో ఎక్కువ వృద్ధి కనిపించింది.

వారు మళ్లీ జాయిన్ అయ్యారు
కొత్త ఎన్‌రోల్‌మెంట్స్ ఏప్రిల్ నెలలో 1 లక్ష కాగా, ఆగస్ట్ నెలలో దీనిని 20,164కుసవరించారు. సెప్టెంబర్ నెలలో 61,807 తగ్గగా, అక్టోబర్ నెలలో 1,04,608కు తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్త చందాదారులు 78.58 పెరగగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 61.12 లక్షలుగా ఉంది. ఏప్రిల్ 2018 నుండి ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 2017 నుండి అక్టోబర్ 2020 మధ్య కొత్త సబ్‌స్క్రైబర్లు 1.94 కోట్లమంది చేరారు. అక్టోబర్ 2020లో 7.15 లక్షల మంది కొత్తగా చేరగా, దాదాపు 2.40 లక్షల మంది బయటకు వెళ్ళారు. దాదాపు 6.80 లక్షల మంది బయటకు వెళ్లి, మళ్లీ జాయిన్ అయ్యారు.


Click it and Unblock the Notifications